ఏపీలో రేపటి నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.అయితే తాజాగా స్కూళ్ల నిర్వహణ సమయాల్లో ప్రభుత్వం మార్పులు చేసింది.
ఎండ తీవ్రత కారణంగా ఈనెల 17వ తేదీ వరకు ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు.ఈ మేరకు ఉదయం 7.30 నుంచి ఉదయం 11.30 గంటల వరకు బడులు నడవనున్నాయి.ఈ మార్పులు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లతో పాటు ఎయిడెడ్ స్కూళ్లకు వర్తించనున్నాయి.