మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) నటి లావణ్య త్రిపాటి(Lavanya Tripati) నిశ్చితార్థ వేడుక ఎంతో ఘనంగా జరిగిన విషయం మనకు తెలిసిందే.ఇలా వీరిద్దరి నిశ్చితార్థ (Engagment) వేడుకకు కేవలం మెగా కుటుంబ సభ్యులతో పాటు అల్లు ఫ్యామిలీ హాజరు అయ్యారు.
ఇలా రెండు కుటుంబ సభ్యుల సమక్షంలో వీరిద్దరి నిశ్చితార్థ వేడుక శుక్రవారం సాయంత్రం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది.ఇక ఈ నిశ్చితార్థ వేడుకకు మెగా ఫ్యామిలీ మొత్తం హాజరయ్యారు.
ఇకపోతే ఫోటోలను మెగా కోడలు ఉపాసన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ లావణ్య త్రిపాఠి మెగా కోడలుగా అడుగుపెట్టడంపై తన అభిప్రాయాలను తెలియజేశారు.
ఉపాసన(Upasana) రామ్ చరణ్ భార్యగా మెగా ఇంటికి పెద్ద కోడలుగా అడుగుపెట్టిన సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఈమె మెగా కోడలుగా రావడమే కాకుండా మెగా ఇంటి పరువు ప్రతిష్టలను కూడా నిలబెట్టారు.ఈ క్రమంలోనే లావణ్య త్రిపాఠి మెగా ఇంటికి రెండో కోడలిగా రాబోతున్న నేపథ్యంలో ఉపాసన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ తన తోటి కోడలు గ్రాండ్ వెల్కమ్(Grand Welcome) చెప్పారు.
ఈ క్రమంలోనే లావణ్య త్రిపాఠి తో రామ్ చరణ్ ఉపాసన కలిసి దిగిన ఫోటోలను ఈమె ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ తన తోటి కోడలుకు స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఉపాసన స్పందిస్తూ… డియరెస్ట్ లావణ్య కొణిదెల ఫ్యామిలీలోకి నీకు స్వాగతం.తోడికోడలుగా నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నాను.నువ్వు భార్యగా వస్తున్నందుకు వరుణ్ చాలా హ్యాపీగా ఉన్నారు అంటూ ఈమె చేసినటువంటి ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.
ఇక వరుణ్ తేజ్ లావణ్య విషయానికి వస్తే వీరిద్దరూ మిస్టర్, అంతరిక్షం అనే సినిమాలలో కలిసి నటించారు.ఇక వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మిస్టర్ సినిమా(Mister Movie) సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని ఇన్ని రోజులు రహస్యంగా వీరి ప్రేమను కొనసాగిస్తూ చివరికి తమ ప్రేమ విషయాన్ని బయటపెట్టారు.