ఏపీలో బీఆర్ఎస్ పరిస్థితి ఇక అంతేనా ? 

ఏపీలో బిఆర్ఎస్ పార్టీ( AP BRS ) పరిస్థితి ఏమిటి అనేది ఎవరికి అంతు పట్టడం లేదు.జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు బీఆర్ఎస్ అధినేత , తెలంగాణ సీఎం కేసీఆర్( CM KCR ) జాతీయ పార్టీని స్థాపించారు.

 Ap Brs Leaders Not Actively Participating In Politics Details, Brs, Bjp, Ysrcp,-TeluguStop.com

వివిధ రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికల్లో బీ ఆర్ ఎస్ ను పోటీకి దింపి,  జాతీయస్థాయిలో బిజెపికి ( BJP ) గట్టి పోటీ ఇవ్వాలనే లక్ష్యంతో ఉన్నారు.దీనిలో భాగంగానే ఏపీలోను బీఆర్ఎస్ కార్యకలాపాలు మొదలుపెట్టారు.

ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ ను( Thota Chandrasekar ) నియమించారు.ఇక వరుసగా సభలు, సమావేశాలు నిర్వహిస్తూ ఏపీలో బీఆర్ఎస్ ప్రభావాన్ని పెంచే ప్రయత్నాలు కేసీఆర్ మొదలుపెట్టారు.

అంతేకాకుండా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పైన , పోలవరం ప్రాజెక్టు,  అమరావతి వ్యవహారాలపైన అప్పుడప్పుడు కెసిఆర్, కేటీఆర్, హరీష్ రావు వంటి నేతలు స్పందిస్తూ ఏపీ రాజకీయాల్లో పట్టు పెంచుకునే ప్రయత్నాలు చేపట్టారు.

Telugu Ap Brs, Hareesh Rao, Ravelakishore, Telangana Cm, Thotachandra, Ysrcp-Pol

ఇతర పార్టీలలోని బలమైన నేతలను బీఆర్ఎస్ లో చేర్చుకుని వచ్చే  ఏపీ ఎన్నికల్లో ప్రభావం చూపించాలనే పట్టుదలతో ఉన్నారు.అయితే ఆశించిన స్థాయిలో బిఆర్ఎస్ కార్యకలాపాలు ఏపీలో మొదలు కాకపోవడం,  పార్టీలో చేరిన ఒకరిద్దరు నేతలు సైతం ఇప్పుడు పూర్తిగా సైలెంట్ అయిపోవడం , కొత్తగా వచ్చి చేరేవారు కనిపించకపోవడం వంటివన్నీ బీఆర్ఎస్ పై అనుమానాలు పెంచుతున్నాయి.బీఆర్ఎస్ లో చేరిన రావెల కిషోర్  తో పాటు , చింతల పార్థసారథి లు ఇప్పుడు యాక్టివ్ గా కనిపించడం లేదు.

ఇటీవల బీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయాన్ని గుంటూరులో తోట చంద్రశేఖర్ ప్రారంభించారు.

Telugu Ap Brs, Hareesh Rao, Ravelakishore, Telangana Cm, Thotachandra, Ysrcp-Pol

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి బిఆర్ఎస్ అగ్ర  నేతలు ఎవరు హాజరు కాలేదు.కనీసం ఏపీ బీఆర్ఎస్ నేత రావెల కిషోర్ బాబు కూడా హాజరు కాకపోవడంతో అనేక అనుమానాలు కలుగుతున్నాయి.రావెల కిషోర్ బాబు బీఆర్ఎస్ లో ఉన్నా, రాజకీయంగా ఏ ప్రయోజనం ఉండదనే అభిప్రాయంతో టిడిపిలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట.

ఇక టిడిపి, జనసేన , వైసిపి , బిజెపి నుంచి పెద్దగా నేతల ఎవరు బీఆర్ఎస్ లో చేరేందుకు ఆసక్తి చూపించకపోవడం, కేసీఆర్ సైతం ఏపీలో పార్టీ వ్యవహారాలపై అంతగా ఫోకస్ పెట్టకపోవడం ఇవన్నీ ఏపీలో బీఆర్ఎస్ కు ఇబ్బందికరంగా మారాయి.బీఆర్ఎస్ అగ్ర నేతలంతా ఏపీలో పార్టీ పరిస్థితిని పట్టించుకునే తీరిక లేనట్టుగా వ్యవహరిస్తుండడంతో,  బిఆర్ఎస్ ఉనికి ఏపీ లో లేనట్టే అనే విధంగా పరిస్థితి తయారయ్యింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube