చంద్రబాబుది మేనిఫెస్టో కాదు మాయఫెస్టో..: మంత్రి సీదిరి

టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి సీదిరి అప్పలరాజు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.చంద్రబాబుది మేనిఫెస్టో కాదన్న ఆయన మాయఫెస్టో అని తెలిపారు.గతంలో మోసపూరిత మేనిఫెస్టోలతో చంద్రబాబు సీఎం అయ్యారని తెలిపారు.2014లో వందల హామీలిచ్చిన చంద్రబాబు పదుల సంఖ్యలో కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు.చంద్రబాబు మేనిఫెస్టో నీటి మీద రాతలు మాత్రమేనన్నారు.పథకాలకు పేర్లు మార్చి అవే పథకాలు ఇస్తాననడానికి సిగ్గు లేదా అని ప్రశ్నించారు.తాను సీఎంగా ఉన్నప్పుడు సంపదను ఎందుకు సృష్టించలేదో చెప్పాలన్నారు.చంద్రబాబు ఇంట్లో రెవెన్యూ జెనరేట్ అయింది తప్ప రాష్ట్రంలో కాదని పేర్కొన్నారు.

 Chandrababu's Manifesto Is Not Mayafesto..: Minister Sidiri-TeluguStop.com

ఇచ్చిన హామీలను వందశాతం నెరవేర్చిన ఘనత జగన్ ది అని కొనియాడారు.జగన్ పాలనలో ఏపీ గ్రోత్ రేట్ దేశంలోనే నంబర్ వన్ గా ఉందని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube