చంద్రబాబుది మేనిఫెస్టో కాదు మాయఫెస్టో..: మంత్రి సీదిరి
TeluguStop.com

టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి సీదిరి అప్పలరాజు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.చంద్రబాబుది మేనిఫెస్టో కాదన్న ఆయన మాయఫెస్టో అని తెలిపారు.


గతంలో మోసపూరిత మేనిఫెస్టోలతో చంద్రబాబు సీఎం అయ్యారని తెలిపారు.2014లో వందల హామీలిచ్చిన చంద్రబాబు పదుల సంఖ్యలో కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు.


చంద్రబాబు మేనిఫెస్టో నీటి మీద రాతలు మాత్రమేనన్నారు.పథకాలకు పేర్లు మార్చి అవే పథకాలు ఇస్తాననడానికి సిగ్గు లేదా అని ప్రశ్నించారు.
తాను సీఎంగా ఉన్నప్పుడు సంపదను ఎందుకు సృష్టించలేదో చెప్పాలన్నారు.చంద్రబాబు ఇంట్లో రెవెన్యూ జెనరేట్ అయింది తప్ప రాష్ట్రంలో కాదని పేర్కొన్నారు.
ఇచ్చిన హామీలను వందశాతం నెరవేర్చిన ఘనత జగన్ ది అని కొనియాడారు.జగన్ పాలనలో ఏపీ గ్రోత్ రేట్ దేశంలోనే నంబర్ వన్ గా ఉందని వెల్లడించారు.
పేద పిల్లల కోసం రచయిత్రిగా.. 12 ఏళ్ల భారత సంతతి చిన్నారి పెద్ద మనసు