హైదరాబాద్లో మళ్లీ కార్ రేసింగ్ సందడి మొదలు కాబోతుంది.ఈ మేరకు ఇవాళ, రేపు హుస్సేన్ సాగర్ తీరంలో తుది దశ కార్ రేసింగ్ జరగనుంది.
సొంత గడ్డపై టైటిల్ కోసం హైదరాబాద్ జట్టు తీవ్రంగా ప్రయత్నిస్తోంది.అదేవిధంగా రేసింగ్ కోసం హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ సిద్ధమైంది.
యాక్సిడెంట్ తో హైదరాబాద్ లో జరగాల్సిన మొదటి రౌండ్ స్ప్రింట్ రేస్ రద్దైన విషయం తెలిసిందే.
కాగా చెన్నైలో జరిగిన రెండు, మూడు రౌండ్లలో హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది.దీంతో పాయింట్స్ పట్టికలో 301.5 పాయింట్లతో మొదటి స్థానంలో హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ ఉండగా.243.5 పాయింట్లతో గాడ్ స్పీడ్ టీం రెండో స్థానంలో నిలిచింది.బ్లాక్ బర్డ్స్ తరపున థామస్ కానింగ్, అఖిల్ రబీంద్రతో అనిందిత్ రెడ్డిలు బరిలోకి దిగనున్నారు.ఇండియన్ రేసింగ్ లీగ్ నిర్వహిస్తున్న నేపథ్యంలో నగరంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి.
అదేవిధంగా ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్ తో పాటు తెలుగుతల్లి ఫ్లై ఓవర్ కింద రాకపోకలు నిలిపివేశారు.