గుజరాత్ లో భారతీయ జనతా పార్టీ ప్రభంజనం సృష్టించింది.గుజరాత్ చరిత్రను మరోసారి తిరగరాసింది.
వరుసగా ఏడోసారి బీజేపీ తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.రాష్ట్రంలో గత రికార్డును బీజేపీ బద్దలు కొట్టింది.
గుజరాత్ లో 1985లో కాంగ్రెస్ కు 149 సీట్లు వచ్చిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో తాజాగా బీజేపీ కాంగ్రెస్ రికార్డును కమలం తిరగరాయనుంది.
మ్యాజిక్ ఫిగర్ 92 సీట్లను దాటిన బీజేపీ ప్రస్తుతం 150కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.ఎగ్జిట్ పోల్ అంచనాలను మించి కమలం ఘన విజయం దిశగా దూసుకెళ్తుంది.
గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరింత దిగజారిందని చెప్పొచ్చు.కనీసం సిట్టింగ్ స్థానాలను కూడా హస్తం నిలుపుకోలేకపోయింది.
కాంగ్రెస్ ఓట్లకు ఆమ్ ఆద్మీ పార్టీ భారీగా గండికొట్టింది.ప్రభుత్వ వ్యతిరేకతపై బీజేపీ ముందే జాగ్రత్త పడింది.
ఈ మేరకు 38 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను కమలం పార్టీ మార్చింది.అభ్యర్థుల ఎంపికలో అన్నీ తానై అమిత్ షా నడిపించారు.
అదేవిధంగా కాంగ్రెస్ కు పట్టు ఉన్న ప్రాంతాల్లో స్వయంగా ప్రధాని మోదీనే ప్రచారం నిర్వహించారు.కాగా గుజరాత్ లో 33 జిల్లాల్లోని 182 అసెంబ్లీ స్థానాల్లో ఈ నెల 1, 5 తేదీల్లో ఎన్నికలు జరిగాయి.
తొలి విడతలో 89, రెండో విడతలో 93 నియోజకవర్గాలకు పోలింగ్ ముగిసిన విషయం తెలిసిందే.