2024 ఎన్నికల్లో గెలుపు లక్ష్యాన్ని జగన్ ఇప్పటికే నిర్దేశించుకున్నారు.ఈ మేరకు పార్టీ ఎమ్మెల్యేలను, నాయకులను అలర్ట్ చేస్తున్నారు.ఎప్పటికప్పుడు సర్వే నివేదికలు , ఇంటెలిజెన్స్ సమాచారాన్ని బేరీజు వేసుకుంటూ, పార్టీ నేతలను అలర్ట్ చేస్తున్నారు.2024 ఎన్నికల్లో గెలుపు అంత ఆషామాషీ గా ఉండదని, 2019 ఎన్నికల మాదిరిగా తన చరిష్మా మీదే పార్టీ నేతలంతా గెలవాలని చూస్తే , అది సాధ్యం కాదని ప్రజల్లో వైసీపీ ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు తమ గ్రాఫ్ పెంచుకుని, ప్రజల్లో ఆదరణ పొందితేనే మళ్లీ అధికారంలోకి వస్తామని జగన్ పదే పదే చెబుతున్నారు.ఇప్పటి వరకు అమలు చేసిన సంక్షేమ పథకాలు, ప్రభుత్వం నిర్ణయాల కారణంగా ప్రతి ఒక్కరికి లబ్ధికు చేకూరింది అనే విషయాన్ని తెలియజేయాలని , గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రజల్లోకి వెళ్లాలని పదేపదే సూచిస్తున్నారు.
ఇప్పటికే పనితీరు సక్రమంగా లేని ఎమ్మెల్యేలకు జగన్ నేరుగా వార్నింగ్ లు ఇచ్చారు.
అటువంటి వారు తమ పనితీరు మార్చుకోకపోతే రాబోయే ఎన్నికల్లో టికెట్ ఇచ్చేదే లేదు అంటూ తేల్చి చెప్పారు.తాజాగా మరోసారి పార్టీ రీజినల్ ఇన్చార్జీలు , జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గాల ఇన్చార్జీలతో జగన్ నేడు సమావేశం కాబోతున్నారు.
ఈ సమావేశంలో ప్రభుత్వం పార్టీ సమన్వయం గురించి జగన్ వివరించబోతున్నారు.అలాగే నియోజకవర్గ స్థాయిలో నేతల మధ్య ఉన్న గ్రూపు రాజకీయాలు , భేదాభిప్రాయాలు వంటి అన్ని విషయాల పైన జగన్ కఠిన నిర్ణయాలను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు.
ప్రతి నియోజకవర్గంలోనూ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని స్పష్టం చేయబోతున్నారు.దీనికోసం నియోజకవర్గాల వారీగా పార్టీ , ప్రభుత్వ వ్యవహారాలపై తాజాగా నియమితులైన కోఆర్డినేటర్లు , పార్టీ రాష్ట్ర శాఖకు ఎప్పటికప్పుడు నివేదికలు పంపేలా కొత్త ఫార్మేట్ ను సిద్ధం చేశారు.
గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని సీరియస్ గా తీసుకొని ఎమ్మెల్యేలకు ఇప్పటికే వార్నింగ్ లు ఇచ్చారు.

వారి పనితీరు మార్చుకోవాలని గత సమావేశంలోనే జగన్ సూచించి వారికి ఇప్పటివరకు సమయం ఇచ్చారు.ఈరోజు జరగబోయే సమావేశంలో అందరి ఎమ్మెల్యేల పంతీరును జగన్ విశ్లేషించబోతున్నారు.ఈ సందర్భంగా పనితీరు సక్రమంగా లేని వారి విషయంలో జగన్ ఏ నిర్ణయం ప్రకటిస్తారు అనేది వైసిపి ఎమ్మెల్యేలకు ఆందోళన కలిగిస్తోంది.
రాబోయే ఎన్నికల్లో టికెట్ రాలేదంటే వారి సమర్థత , పనితీరు కారణం అనే విషయాన్ని జగన్ ఈ సమావేశంలోని స్పష్టం చేయబోతున్నారట.దాదాపు 36 మంది ఎమ్మెల్యేల పనితీరు అంచనాల కంటే బాగా తక్కువగా ఉన్నట్టు పార్టీలో చర్చ జరుగుతోంది.







