కేరళలో బర్డ్ ఫ్లూ కలకలం సృష్టిస్తోంది.కొట్టాయంలోని రెండు పంచాయతీల్లో బర్డ్ ఫ్లూ విజృంభణ కొనసాగుతుంది.
దీంతో అప్రమత్తమైన కేరళ ప్రభుత్వం బర్డ్ ఫ్లూ పంజా కట్టడికి చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది.వైరస్ ఇతర ప్రాంతాలకు వ్యాపించే అవకాశాలు ఉండటంతో కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఇందులో భాగంగా ప్రభావిత ప్రాంతాల నుంచి కిలోమీటర్ దూరం మేర ఉన్న కోళ్లు, బాతులతో పాటు ఇతర పెంపుడు పక్షులను చంపాలని ఆదేశించింది.అదేవిధంగా పారిశుద్ధ్య పనులను వేగవంతం చేయాలని సూచించింది.
క్రిమి సంహారక మందులను చల్లాలని స్థానిక సంస్థలకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.అంతేకాకుండా బర్డ్ ఫ్లూ విస్తరించిన ప్రాంతాల నుంచి మాంసం అమ్మకాలు, ఎగుమతులు, దిగుమతులపై నిషేధం విధించారు.