ప్రస్తుతం తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ షో ముగింపు దశకు చేరుకుంది.ఈ నేపథ్యంలోనే టాప్ సిక్స్ లో ఉన్న కంటెంట్ల ప్రయాణానికి సంబంధించిన వీడియోలను వారికి చూపిస్తూ వారి గొప్పతనం మంచితనం గురించి ధైర్యం గురించి చెబుతూ వారికి భారీగా సర్ప్రైస్ ఇస్తున్నాడు బిగ్ బాస్.
ఇప్పుడు ఒక్కసారి వెనక్కు తిరిగి చూసుకుంటే వారు చేసిన చిలిపి పనులు, అల్లర్లు, కష్టాలు, కొట్లాటలు, కోపతాపాలు, అరుపులు,సంతోషాలు, ఏడుపులు ఇలా అన్నీ కనిపిస్తున్నాయి.వీటన్నింటి పరిగణనలోకి తీసుకున్న బిగ్‌బాస్ వారి వ్యక్తిత్వాన్ని మెచ్చుకుంటూ జర్నీ వీడియోలు చూపిస్తున్నాడు.
ఈ క్రమంలోనే తాజాగా కీర్తి గురించి బిగ్‌బాస్ మాట్లాడుడూ.కల్పితం కన్నా నిజ జీవితం ఎంతో నాటకీయమైనది.ఒకవైపు మీ బరువైన గతం మిమ్మల్ని లోపలి నుంచి దహిస్తున్న కూడా మీరు చూపించిన గుండె నిబ్బరం ఎందరికో స్ఫూర్తి నిస్తోంది.అడవిలో మహావృక్షం ఒకటే ఉంటుంది.
అది తాను ఒంటరినని బాధపడి తల వంచితే ఆకాశం తాకే తన ఎదుగుదలను చూడలేదు.ఇంట్లో మిమ్మల్ని అర్థం చేసుకునేవారు కనపడక కలవరపడ్డారు.
అలాగే మీదంటూ ఒక కుటుంబం లేదని బాధపడ్డారు.సింపతీ కోసమే మీ ప్రయత్నం అని మిగతా కంటెస్టెంట్స్ నిందించినప్పుడు మీ మనసు గాయపడింది.

కానీ మీ ఆట ఆగలేదు.గాయాలు మిమ్మల్ని ఆపలేకపోయాయి.గ్రాండ్ ఫినాలేకు చేరాలనే కోరిక సాధ్యమవడానికి కారణం మీరు ఒక్కరు మాత్రమే కాదు, కుటుంబం కూడా.ఎందుకంటే మీ కుటుంబ సభ్యుల సంఖ్య ఒకటి కాదు కొన్ని లక్షలు.
కష్టాల పునాదుల పై నిర్మించి విజయాన్ని కదపడం అంత సులభం కాదు అంటూ బిగ్‌బాస్ కీర్తిని ఆకాశానికి ఎత్తేయడంతో ఆమె ఆనంద భాష్పాలు రాల్చింది.కాగా ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇది ఇలా ఉంటే బిగ్ బాస్ హౌస్లో ప్రస్తుతం ఆరుగురు కంటెస్టెంట్స్ మాత్రమే ఉన్న విషయం తెలిసిందే.వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారు ఎవరు ఫైనల్ కి వెళ్తారు అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.







