గ్రాడ్యుయేషన్ డే రోజు యువతికి బిగ్గెస్ట్ సర్‌ప్రైజ్.. ఏంటంటే..

గ్రాడ్యుయేషన్ డే( Graduation Day ) అనేది ప్రతి విద్యార్థి జీవితంలో ఒక ముఖ్యమైన మైలురాయి అని చెప్పుకోవచ్చు.అయితే ఈరోజును మరింత స్పెషల్‌గా మార్చాలని ఒక విద్యార్థిని సిస్టర్స్ అనుకున్నారు.

 Biggest Surprise For Young Girl On Graduation Day, Graduation Day, Viral Video,-TeluguStop.com

వారి సిస్టర్ ఓ నర్సింగ్ విద్యార్థిని.పేరు సామ్.

అయితే ఆమె గ్రాడ్యుయేషన్ డే కొంత విచారం ఉంది.ఎందుకంటే తల్లి ఆమె గ్రాడ్యుయేషన్ డే చూడలేదు.

తల్లి లేకపోవడం వల్ల ఆమె ఆనందం కొంతవరకు తగ్గిపోయింది.సామ్ బాధను అర్థం చేసుకున్న ఆమె సిస్టర్స్, ఆమెను ఓదార్చడానికి, తల్లి లేకపోవడం వల్ల కలిగిన లోటును తీర్చడానికి ఒక ఆశ్చర్యకరమైన ప్లాన్ చేశారు.

ఆమె ముఖంలో చిరునవ్వు చిందించడానికి, సామ్‌ గ్రాడ్యుయేషన్ డే ( Sam’s graduation day )ఆనందంగా జరపడానికి వారు చాలా శ్రద్ధగా ప్లాన్ చేశారు.

హార్ట్ టచింగ్ మూమెంట్ ఒక వీడియోలో రికార్డు అయింది.ఇప్పుడు అది ఇంటర్నెట్‌లో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది.ఆ వీడియోలో, ఒక సిస్టర్ కెమెరా ముందు నిలబడి, తల్లి లేకుండా గ్రాడ్యుయేషన్ జరుపుకోవడం ఎంత కష్టమో అర్థం చేసుకుంటూ సామ్‌తో మాట్లాడుతుంది.

ఆ తర్వాత సామ్‌కు సర్‌ప్రైజ్ చూడమని చెబుతుంది.ఆసక్తిగా, సామ్ తన కళ్లు తెరిచి, ఆశ్చర్యాన్ని చూస్తుంది.ఒక చిన్న కుక్కపిల్ల ఆమె ముందు కనిపిస్తుంది.దాన్ని చూడగానే సామ్ చాలా ఎమోషనల్ అయిపోతుంది.

అనుకోని బహుమతి వల్ల ఆమె కళ్ల నిండా ఆనంద భాష్పాలు కూడా తిరుగుతాయి.

ఓ సిస్టర్ సామ్‌తో కూర్చుని, ఆప్యాయంగా ఆమె చేతుల్లో కుక్కపిల్లని ఉంచుతుంది.కొత్త పెంపుడు జంతువు ఒక మగ కుక్కపిల్ల, సామ్ సిస్టర్ సామ్‌ను కుక్క పిల్లకి నువ్వే ‘అమ్మ’ అని ఆటపట్టిస్తుంది.వీడియో సామ్ పప్పీని కౌగిలించుకోవడంతో ముగుస్తుంది.

ఈ వీడియో చాలా మంది హృదయాలను తాకింది, చూసిన వారందరూ దీన్ని షేర్ చేస్తూ విస్తృతంగా వైరల్ చేశారు.చాలా మంది సామ్ భావోద్వేగ ప్రతిస్పందనకు కదిలిపోయి, వారి సొంత పెంపుడు జంతువుల అనుభవాలను వ్యాఖ్యలలో పంచుకున్నారు.

ఒక వ్యక్తి తనకు దత్తత తీసుకున్నప్పుడు తనకు ఒక కుక్క దొరికిందని గుర్తు చేసుకుంటూ, ఆ కుక్కను తన ఉత్తమ స్నేహితుడు అని పిలిచాడు.ఈ లింక్ పై క్లిక్ చేసి వీడియోను చూడవచ్చు.

https://fb.watch/srIKgzxHe9/
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube