విమానంలో ప్రయాణం చాలా సౌకర్యంగా ఉంటుంది, కానీ దానితో కొన్ని కొత్త బాధ్యతలు కూడా వస్తాయి.ప్రయాణికులు తాము సందర్శించే దేశాల నియమాలు, నిబంధనల గురించి తెలుసుకోవాలి.
లేకపోతే ఇబ్బందులు తప్పవు.ఇటీవల ఇండోనేషియాకు( Indonesia ) చెందిన ఒక ప్రయాణికుడు హాంకాంగ్-తైవాన్‌కు వెళ్లే విమానం ఎక్కాడు.
తైపీ ఎయిర్‌పోర్ట్‌లో( Taipei Airport ) దిగిన తర్వాత, అతని సామాను తనిఖీ చేయడానికి అధికారులు నిలిపివేశారు.
స్పెషల్లీ ట్రైన్డ్ డాగ్ అతని బ్యాగ్‌లో ఏదో అనుమానాస్పదమైన వాసనను గుర్తించింది.తనిఖీ చేసిన అధికారులు అతని లంచ్ బాక్స్‌లో కాల్చిన పంది మాంసం,( Roast Pork ) సోయా సాస్ ఉన్నాయని కనుగొన్నారు.ఈ వస్తువులు తైవాన్‌లో( Taiwan ) నిషేధించబడ్డాయని ఆ ప్రయాణికుడికి తెలియదు.
అధికారులు ఆ ప్రయాణికుడిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు.తైవాన్ చట్టం ప్రకారం, అతనికి 48,430 హాంకాంగ్ డాలర్లు (సుమారు రూ.5 లక్షలు) జరిమానా విధించారు.జరిమానా చెల్లించలేకపోవడంతో అతనిని తిరిగి హాంకాంగ్‌కు( Hong Kong ) పంపించారు.
భవిష్యత్తులో తైవాన్‌కు తిరిగి రావాలనుకుంటే, ఆ జరిమానా చెల్లించాల్సిందే అని ఆదేశించారు.
2018లో, తైవాన్‌లో పందుల మహమ్మారి వ్యాప్తి చెందిన నేపథ్యంలో చట్టాన్ని సవరించారు.దాంతో పంది మాంసాన్ని దిగుమతి చేసుకోవడం శిక్షార్హమైన నేరంగా మారింది.తైవాన్‌కు పంది మాంసాన్ని తీసుకెళ్లడం వల్ల భారీ జరిమానా ఫేస్ చేయాల్సి వస్తుంది.పదే పదే నిబంధనలు ఉల్లంఘించే వారిపై మరింత ఎక్కువ జరిమానా విధిస్తారు.1 మిలియన్ తైవానీస్ డాలర్ల వరకు ఫైన్ వేసిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు.ఒకవేళ తప్పుగా తీసుకెళ్లినట్లు నిర్ధారించబడితే, ప్రయాణికులు శిక్ష నుంచి మినహాయించబడవచ్చు.మీలో ఎవరైనా తైవాన్ వెళ్లాలనుకుంటే అక్కడ ఏమేం బ్యాన్ చేశారో ముందుగా తెలుసుకోవడం మంచిది లేదంటే లక్షల్లో ఫైన్ చెల్లించుకోవాల్సిన దుస్థితి వస్తుంది.