ఒక వ్యక్తి కస్టపడి, నలుగురు కూర్చుని తింటామంటే ప్రస్తుత రోజుల్లో కుదరని పని.అందుకే ఇపుడు ఒక వ్యక్తి కేవలం తను చేసే ఉద్యోగం ద్వారా వచ్చే ఆదాయం పైనే కాకుండా వివిధ ఆదాయ వనరులపై కూడా ఆధారపడుతున్న పరిస్థితి వుంది.
ఇందుకోసం మార్కెట్లో అందుబాటులో ఉన్న అనేక పెట్టుబడి మార్గాల్లో జనాలు ఎంతోమంది మదుపు చేస్తుంటారు.ఇక ఎన్ని రకాల ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఉన్నా సరే.అవి కొన్నేళ్ల తర్వాత కాలం చెల్లుతాయనే విషయం విదితమే.అయితే వీటికి భిన్నంగా ఓ అద్భుతమైన మదుపు పద్ధతి అందుబాటులోకి ఉంది.
దీని ద్వారా మీరు ఆస్తులు కొనకుండానే నెలనెలా ఓ నిర్దిష్టమైన అద్దె ఆదాయాన్ని పొందవచ్చని మీకు తెలుసా? అదే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్( REIT ) ప్లాన్.
అవును, తక్కువ రిస్క్‌తో కూడుకున్న ఈ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్( Investment Plan ) గురించి తెలుసుకుంటే ఇపుడే ఇన్వెస్ట్ చేస్తారు.రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్( Real Estate Investment Trust ).అనేది ఓ పెట్టుబడి మార్గం.ఇది మీ ఆదాయాన్ని పెంచే ఓ రియల్ ఎస్టేట్ సాధనం అన్నమాట.దీని ద్వారా మీరు ప్రతినెలా ఓ కచ్చితమైన అద్దె ఆదాయాన్ని మీరు పొందవచ్చు.దీంతో మీరు సాధారణంగా ఉద్యోగం ద్వారా పొందే ఆదాయానికి అదనంగా సంపాదించుకోవచ్చు.REIT ప్రధాన ఉద్దేశం ఏంటంటే.
మదుపరులు నేరుగా ఆస్తులను కొనుగోలు చేయకుండానే వాటిపై పెద్దమొత్తంలో ఇన్వెస్ట్ చేయించడం అన్నమాట.తద్వారా తక్కువ రిస్క్‌తో కూడిన నిరంతర ఆదాయాన్ని పొందవచ్చు.
అవును, అందుకే ఎక్కువగా రిస్క్ తీసుకోకుండా పెట్టుబడులు( Investments ) పెట్టాలనుకునేవారికి REIT పద్ధతి అనేది ఒక చక్కని ఇన్వెస్ట్మెంట్ ప్లాన్‌గా సూచిస్తున్నారు ఆర్థిక నిపుణులు.అయితే ఏదైనా REITలో పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకునే ముందు ఇందులో ఉన్న సాధ్యాసాధ్యాలను లోతుగా పరిశీలించడమే కాకుండా మార్కెట్ నిపుణుల సూచనలు తీసుకుంటే ఉత్తమమైన ఫలితాలను ఖచ్చితంగా పొందగలరు.REITలో మదుపు చేసే సమయంలో వీటిని నిర్వహించే ఎక్స్‌పర్ట్స్‌తో మంచి సత్సంబంధాలను కలిగి ఉండాలి.REIT అనేది రియల్ ఎస్టేట్( Real Estate ) ఆస్తుల సమూహం నుంచి ఓ కచ్చితమైన ఆదాయాన్ని సృష్టిస్తుంది.
క్లుప్తంగా చెప్పాలంటే వీటిని మ్యూచువల్ ఫండ్స్ లాగే నిర్వహిస్తారు.