రాజధానులు మూడు కాదు ముప్పై అంటున్న వైసీపీ మంత్రి

ఏపీ రాజధాని విషయంలో గత మూడు రోజులుగా ఎక్కడ లేని రాజకీయ చర్చ జరుగుతోంది.

అసెంబ్లీలో జగన్ ఏపీ రాజధాని మూడు ప్రాంతాల్లో ఉండవచ్చు అంటూ ప్రకటించడంతో ఈ హడావుడి మొదలైంది.

కర్నూల్ లో హైకోర్టు, అమరావతి, విశాఖలో రాజధాని ఇవన్నీ పరిపాలనా సౌలభ్యం కోసమేనని, తద్వారా ఈ మూడు ప్రాంతాల్లో సమాన అభివృద్ధి జరుగుతుంది అంటూ జగన్ ప్రకటించారు.దీంతో ఈ అంశంపై ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేశాయి.

జగన్ తుగ్లక్ చర్యలకు పాల్పడుతున్నారు అంటూ టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు విమర్శించారు.ఇక జనసేన అధినేత పవన్ కూడా దీనికి సంబంధించి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ అనేక ట్విట్లు పెట్టారు.

తాజాగా ఇదే విషయమై వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు.అమరావతిలో రైతుల భూములు వెనక్కి ఇచ్చేశాతమని అన్నారు అంతే కాకుండా తాము అవసరమైతే మూడు రాజధానూలు కాదు ముప్పై చోట్ల రాజధానులు పెట్టుకుంటామని, దీనికి కేంద్రం అనుమతి అవసరమే లేదంటూ ప్రకటించారు.

Advertisement

కేవలం తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకుని ఉన్నవారు మాత్రమే అమరావతిలో ఆందోళన చేస్తున్నారు అంటూ ఆయన మండిపడ్డారు.ప్రజలందరూ రాజధాని నిర్మాణం మూడు ప్రాంతాల్లో చేపట్టబోతుండడాన్ని అభినందిస్తున్నారని అయన చెప్పారు.

అసలు చంద్రబాబు ఐదేళ్ల పదవీ కాలంలో రాజధాని కోసం చిత్తశుద్ధి తో పని చేయలేక పోయింది అన్నారు.రాజధాని నిర్మాణం అనేది రాష్ట్ర పరిధిలోని అంశం కాబట్టి తమకు అనుకూలంగా ఉన్నచోటల్లా పెట్టుకుంటామని, దీనికి కేంద్ర ప్రభుత్వం అనుమతి అవసరం లేదంటూ పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి చెప్పుకొచ్చారు.

Advertisement

తాజా వార్తలు