బ్రిటన్‌లో పనిచేయాలనుకుంటున్న డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బందికి ఆ దేశ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.విదేశాల నుంచి వచ్చే నిపుణులకు సత్వరం వీసా మంజూరు దిశగా యూకే ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టాలని భావిస్తోంది.
ప్రభుత్వ రంగ జాతీయ ఆరోగ్య సేవ (ఎన్‌హెచ్ఎస్)లో ఖాళీలను భర్తీ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని పార్లమెంట్‌లో రాణి ఎలిజబెత్-2 గురువారం ప్రకటించారు.
ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రధాని బోరిస్ జాన్సన్ ‘‘ఎన్‌హెచ్ఎస్ వీసా’’ అంటూ కొన్ని సంకేతాలను అప్పుడే ఇచ్చారు.
దీనిని ధృవీకరిస్తూ రాణి ప్రసంగం సాగింది.నేషనల్ హెల్ సర్వీస్‌లో శ్రామిక శక్తిని పెంచడానికి తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని… కొత్తగా ప్రవేశపెట్టే వీసా ద్వారా అర్హతగల వైద్యులు, నర్సులు, ఆరోగ్య నిపుణులు యూకేలోకి ప్రవేశించేలా చేస్తుందని ఎలిజబెత్-2 పేర్కొన్నారు.

ఆధునిక, సరసమైన పాయింట్ల ఆధారిత ఇమ్మిగ్రేషన్, ఆర్ధిక వ్యవస్థ కలగిన యూనైటెడ్ నేషన్స్ ప్రపంచవ్యాప్తంగా వున్న నైపుణ్యం కలిగిన కార్మికులకు మద్ధుతుగా ఉంటుందని రాణి పేర్కొన్నారు.దేశంలో ఆస్ట్రేలియా తరహా పాయింట్ల ఆధారిత ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను ప్రవేశపెడతామని సార్వత్రిక ఎన్నికలకు ముందు బోరిస్ జాన్సన్ స్పష్టం చేశారు.వచ్చే ఏడాది యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ తప్పుకున్న తర్వాత కొత్త ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను ప్రవేశపెట్టాలని యూకే ప్రభుత్వం యోచిస్తోంది.ఇది ప్రపంచవ్యాప్తంగా నైపుణ్యం కలిగిన వలసదారులను ఆకర్షించేలా ఉంటుందని, అలాగే ఈయూ నిబంధనలు ఇకపై యూకేకు వర్తించవని ప్రభుత్వం వెల్లడించింది.
విస్తృతంగా సాగిన రాణి ప్రసంగంలో 2020 జనవరి 31న ముగియనున్న బ్రెగ్జిట్ గడువుపైనే ప్రధానంగా నడిచింది.సార్వత్రిక ఎన్నికల్లో 80 శాతం మెజారిటీతో తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపసంహరణ ఒప్పంద బిల్లును తిరిగి తీసుకురావడానికి జాన్సన్ సిద్ధమయ్యారు.
ఈయూ నుంచి యూకే వైదొలిగేందుకు వీలు కల్పించే చట్టాన్ని శుక్రవారం పార్లమెంట్ ముందుకు తీసుకువచ్చేందుకు జాన్సన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.