1.బీజేపీ ఆఫీసులో విమోచన దినోత్సవం

తెలంగాణ బిజెపి కార్యాలయంలో సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా జాతీయ జెండాను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సీనియర్ నేత డాక్టర్ లక్ష్మణ్ ఆవిష్కరించారు.
2.లొంగిపోనున్నా శారదక్క

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మావోయిస్టు పార్టీ నేత తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి హరి భూషన్ అలియాస్ యాప నారాయణ భార్య సమ్మక్క అలియాస్ శారదక్క తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోనున్నారు.
3.అక్టోబర్ 24న ఏపీపీ పరీక్షలు
తెలంగాణలో 151 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల భర్తీకి అక్టోబర్ 24న రాత పరీక్ష నిర్వహిస్తున్నట్లు పోలీస్ నియామక మండలి గురువారం ప్రకటించింది.
4.తెలంగాణ భవన్ లో విలీన దినోత్సవ వేడుకలు
తెలంగాణ భవన్ లో విలీన దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.ఎంపీ కే కేశవరావు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.
5.తిరుమల సమాచారం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది గురువారం తిరుమల శ్రీవారిని 25,821 మంది భక్తులు దర్శించుకున్నారు.
6.నేడు నిర్మల్ లో బీజేపీ భారీ బహిరంగ సభ
నిర్మల్ జిల్లాలో ఈరోజు బిజెపి భారీ బహిరంగ సభ నిర్వహించనుంది.కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరు కాబోతున్నారు.
7.జగన్ అక్రమాస్తుల కేసు

ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులు విశ్రాంత ఐఏఎస్ వెంకట్రామిరెడ్డి రాజగోపాల్ లకు సిబిఐ ప్రత్యేక కోర్టు నాన్ బెయిలబుల్ వారంట్లు జారీ చేసింది.
8.రేపటి నుంచి చార్ ధాం యాత్ర
ఉత్తరాఖండ్ హైకోర్టు చార్ ధామ్ యాత్ర పై ఉన్న నిషేధాన్ని గురువారం ఎత్తివేసింది.
9.ఎంసెట్ ఆధారంగానే ఎంసెట్ కోటా భర్తీ

ఎంసెట్ మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీని ఆన్లైన్ విధానంలో చేపట్టాలని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలకు తెలంగాణ ఉన్నత విద్యా మండలి సూచించింది.
10.నేటి నుంచే బీఈడీ సెమిస్టర్ పరీక్షలు
నాగార్జున యూనివర్సిటీ పరిధిలోని బీఈడీ కళాశాలలో ఈ నెల 17 నుంచి మొదటి సెమిస్టర్ పరీక్షలు నిర్వహించనున్నారు.
11.హైదరాబాద్ పోలీస్ కమిషనర్ పై దూషణలు

హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ను ఓ వ్యక్తి బెదిరించాడు.అసభ్య పదజాలంతో దూషించారు.దీనిపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
12.జడ్పిటిసి ఎంపిటిసి ఓట్ల లెక్కింపు పై సీఎస్ సమీక్ష
జడ్పిటిసి ఎంపిటిసి ఓట్ల లెక్కింపు పై ఏపీ సి ఎస్ ఆదిత్యనాథ్ దాస్ సమీక్ష నిర్వహించారు.
13.డిగ్రీ కళాశాలలో ఇంగ్లీష్ మీడియం పై ప్రభుత్వ ఉత్తర్వులు
ఏపీ లోని అన్ని డిగ్రీ కళాశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
14.జగన్ కు చంద్రబాబు లేఖ

ఏపీ సీఎం జగన్ కు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు లేఖ రాశారు.81 మంది తో టిటిడి బోర్డు ఏర్పాటు చేయడం పుణ్యక్షేత్రం పవిత్రతను దెబ్బతీయడమేనని, బోర్డులు అవినీతి పరులు, నేరచరిత్ర ఉన్నవారు ఉన్నారని లేఖలో ప్రస్తావించారు
15. సోనుసూద్ ఇంట్లో మూడో రోజు సోదాలు

ప్రముఖ సినీ నటుడు సోను సూద్ ఇంటిపై మూడో రోజు ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు.
16.భారత్ లో కరోనా
గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 34,403 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
17.రాజు ఆత్మహత్య పై హైకోర్టులో పిల్

సైదాబాద్ సింగరేణి కాలనీ చిన్నారిపై అత్యాచార ఘటనలో నిందితుడిగా ఉన్న రాజు ఆత్మహత్య చేసుకోవడంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ తెలంగాణ హైకోర్టులో ఈ రోజు ప్రజా ప్రయోజన వ్యాజ్యం ను పౌరహక్కుల సంఘం నేత ప్రొఫెసర్ లక్ష్మణ్ దాఖలు చేశారు.
18.శ్రీవారి బ్రహ్మోత్సవాలపై టిటిడి క్లారిటీ
శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహణపై తిరుమల తిరుపతి దేవస్థానం శుక్రవారం క్లారిటీ ఇచ్చింది.కరోనా నేపథ్యంలో ఈ ఏడాది కూడా ఏకాంతంగానే స్వామివారి బ్రహ్మోత్సవాలన నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లు టిటిడి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి ప్రకటించారు.
19.జీఎస్టీ మండలి సమావేశం

వస్తు సేవల పన్ను ( జిఎస్టి ) అత్యున్నత స్థాయి నిర్ణయాక మండలి – జిఎస్టి కౌన్సిల్ 45 వ సమావేశం శుక్రవారం లక్నోలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ప్రారంభమైంది.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 45,380 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 46,380