ప్రస్తుతం తెలంగాణలో ప్రధాన పార్టీలలోని కొందరు అగ్రనేతలు రెండు చోట్ల పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.బిఆర్‌ఎస్ అధినేత కేసిఆర్( KCR ), బీజేపీ నుంచి ఈటల రాజేందర్,( Etala Rajender ) కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి ( Revanth Reddy )ఇలా ఆగ్రనేతలు గతంలో కంటే భిన్నంగా రెండేసి చోట్ల పోటీ చేస్తున్నారు.అయితే వీరికి రెండు చోట్ల విజయం సాధించడం సాధ్యమేనా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.2014, 2018 ఎన్నికల్లో కేవలం గజ్వేల్ నుంచి పోటీ చేసిన కేసిఆర్ అఖండ విజయాన్ని సొంతం చేసుకున్నారు.ఈసారి మాత్ర గజ్వేల్ తో పాటు కామారెడ్డిలో కూడా పోటీ చేస్తున్నారు.

ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే కామారెడ్డి లో కూడా కేసిఆర్ విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.అటు బీజేపీ నుంచి ఈటల రాజేందర్ కూడా రెండు చోట్ల పోటీ చేస్తున్నారు.తనకు పట్టున్న హుజూరాబాద్ ( Huzurabad )తో పాటు కేసిఆర్ కు పోటీగా గజ్వేల్ నుంచి కూడా బరిలో ఉన్నారు.
అయితే గజ్వేల్ లో కేసిఆర్ కు ఈటెల ఎంతవరకు పోటీనిస్తారనేది ఆసక్తికరం.గజ్వేల్ లో కేసిఆర్ పై ఈటల పైచేయి సాధించడం కష్టమే అనే వాదన వినిపిస్తోంది.
అటు రేవంత్ రెడ్డి కూడా కోడంగల్ తో పాటు కేసిఆర్ కు పోటీగా కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నారు.ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం రేవంత్ రెడ్డికి కోడంగల్ లో కూడా విజయం కష్టమే అనేది చాలమంది అభిప్రాయం.

ఇక కామారెడ్డి విషయానికొస్తే ఇక్కడ రేవంత్ రెడ్డికి ఏమాత్రం పట్టు లేకపోయినప్పటికి కేసిఆర్ కు పోటీగా బరిలో ఉండాలనే ఆలోచనతోనే రేవంత్ రెడ్డి కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నారనేది చాలమంది చెబుతున్నా మాట.ఆ రకంగా చూస్తే కామారెడ్డిలో రేవంత్ రెడ్డి ఓటమి ముందే ఊహించరనేది తేటతెల్లమౌతుంది.మొత్తానికి రెండు చోట్ల పోటీ చేస్తున్న నేతల విషయంలో డబుల్ విన్నింగ్ సాధించడం కేసిఆర్ కు సాధ్యమయ్యే అవకాశాలు ఉన్నాయని.మిగిలిన వారిలో ఈటల రాజేందర్, రేవంత్ రెడ్డి వంటివారికి డబుల్ విన్నింగ్ కష్టమే అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి.
మరి ఏం జరుగుతుందో చూడాలి.