ప్రస్తుతం తెలంగాణ అధికార ప్రతి బీఆర్ఎస్ రాజకీయంగా అనేక ఇబ్బందులు ఎదుర్కుంటోంది.ఒకవైపు కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవితను( Mlc kavitha ) ఈడీ అధికారులు పదేపదే విచారణకు పిలుస్తూ ఢిల్లీలో హడావుడి చేస్తున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం లో కవితను త్వరలోనే అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.మరోవైపు చూస్తే తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది.
ఒకవైపు టీఎస్ పీఎస్సి పేపర్ లీకేజీ వ్యవహారాల పైన ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు చేయడంతో పాటు, ప్రజల్లోకి ఆ అంశాలను తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తూ.రాజకీయంగా బీఆర్ఎస్( BRS ) ను ఇరుకున పెట్టే ప్రయత్నాలు చేస్తోంది.
ఈ క్రమంలో ఈ వ్యవహారాలు అన్నిటిని చక్కదిద్దుకుంటూనే .దేశవ్యాప్తంగా బిఆర్ఎస్ ను అధికారంలోకి తీసుకురావాలనే వ్యూహానికి కేసీఆర్ ముందడుగులు వేస్తూనే ఉన్నారు.దీనిలో భాగంగానే మహారాష్ట్రలో బీఆర్ఎస్ కిసాన్ సమితి సభను ఈనెల 26న కాందార్ – లోహాలో నిర్వహించబోతున్నారు.ఈ బహిరంగ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించి బీఆర్ఎస్ జెండా మహారాష్ట్రలోనూ ఎగిరే విధంగా కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు.

గత నెల 5 న నాందేడ్ లో బీఆర్ఎస్ సభను భారీగా నిర్వహించారు.ఆ సభ తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వం రైతులకు పంట పెట్టుబడి సాయాన్ని ప్రకటించింది.కేసీఆర్ నాందేడ్ లో పర్యటించిన తర్వాతే తమకు మేలు జరిగిందని అక్కడ రైతులు భావిస్తున్నట్లుగా బీఆర్ఎస్ అంచనా వేస్తోంది.దీంతో మరింత ఉత్సాహంతో మహారాష్ట్ర అంతటా బీఆర్ఎస్ కిసాన్ సమితి ఆధ్వర్యంలో మహారాష్ట్ర రైతులు తెలంగాణ మోడల్ కు విస్తృత అవగాహన కల్పిస్తోంది.
మహారాష్ట్రలో జరిగే పంచాయతీ సమితి ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ప్రస్తుతం ఈనెల 26న కాంధార్ – లోహో లో బహిరంగ సభ కు బీఆర్ఎస్ విస్తృతంగా ఏర్పాట్లను నిజామాబాద్ జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షుడు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హిమన్ష్ తివారీ , మహారాష్ట్ర బీఆర్ఎస్ కిసాన్ సమితి రాష్ట్ర అధ్యక్షుడు తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.ఎక్కడ ఎటువంటి లోటుపాట్లు తలెత్తకుండా ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేపట్టారు.