తెలుగు ప్రేక్షకులకు కన్నడ అబ్బాయి ప్రశాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఒకప్పుడు హీరోగా ఎన్నో సినిమాలలో నటించిన ప్రశాంత్ ఆ తర్వాత క్యారెట్ ఆర్టిస్టుగా తెలుగు తమిళ మలయాళ భాషల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఇలా అన్ని భాషల్లో కలిపి దాదాపుగా 40 సినిమాలలో నటించారు ప్రశాంత్.సూపర్‌స్టార్ రజనీకాంత్ అతడికి సంజయ్ భార్గవ్ అనే స్క్రీన్ నేమ్ సూచించడంతో ఆ పేరుతోనే కంటిన్యూ అయ్యాడు.
అతడి తల్లి భరతనాట్య కళాకారిణి.అలా చిన్నప్పటినుంచే క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకున్నాడు.
![Telugu Sanjaybhargav, Divorce, Marraige, Sanjay Bhargav, Tollywood-Movie Telugu Sanjaybhargav, Divorce, Marraige, Sanjay Bhargav, Tollywood-Movie](https://telugustop.com/wp-content/uploads/2024/04/actor-sanjay-bhargav-about-his-marriage-and-divorceb.jpg)
ఇటీవల కాలంలో ఆయన సినిమాలు చేయడం చాలా వరకు తగ్గించేశారు.ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు ప్రశాంత్.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించారు.వ్యక్తిగత విషయాల గురించి కూడా చెప్పుకొచ్చారు.ఈ మేరకు ప్రశాంత్ మాట్లాడుతూ.పెళ్లయిన కొంతకాలానికే విడిపోతున్నారు.
కానీ పిల్లలున్నప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి.భార్య భర్తల మధ్య ఏదున్నా అది వారి మధ్యే ఉండాలి.
పిల్లల మనసును పాడుచేయకూడదు.నా విషయంలో ఇదే జరిగింది.
ఎవరైనా విడిపోయారనగానే మగవాడిదే తప్పంటారు.మహిళా శక్తి అంటూ ఆడవాళ్లకు సపోర్ట్ చేస్తారు.
![Telugu Sanjaybhargav, Divorce, Marraige, Sanjay Bhargav, Tollywood-Movie Telugu Sanjaybhargav, Divorce, Marraige, Sanjay Bhargav, Tollywood-Movie](https://telugustop.com/wp-content/uploads/2024/04/actor-sanjay-bhargav-about-his-marriage-and-divorcec.jpg)
ఇద్దరినీ సమానంగా చూడాలి.ముఖ్యంగా పిల్లల మనసు కలుషితం చేయకూడదు.నేను నా భార్యకు విడాకులిచ్చినప్పుడు చెన్నైలో ఉన్నాను.చాలామంది నీకు ఎవరితోనైనా ఎఫైర్ ఉందా? అందుకనే విడాకులు తీసుకున్నావా? అని పిచ్చి ప్రశ్నలు వేశారు.ఇండస్ట్రీలో ఉన్నంత మాత్రాన నేను చెడిపోయినట్లేనా? ఆ మాటలు విన్నప్పుడు బాధేస్తుంది.నా పిల్లలు మాజీ భార్య దగ్గరే ఉంటారు.
వారికి ఆర్థికంగా సాయం చేస్తుంటాను.అయినా సరే వాళ్లు నన్ను కలవడానికి, మాట్లాడటానికి కూడా పెద్దగా ఆసక్తి చూపరు.
నా మాజీ భార్య ఏం చేసిందో నాకు తెలుసు.అది నేను బయటకు చెప్పలేను.ఇప్పుడైతే నా పిల్లలు సెటిల్ అయ్యారు.2016లో నేను విడాకులు తీసుకున్నాను.రెండో పెళ్లి జోలికి వెళ్లకూడదు అనుకున్నాను.డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ద్వారా హేమను కలుసుకున్నాను.2017లో మేము పెళ్లి చేసుకున్నాం.ఆ మరుసటి ఏడాదే కూతురు పుట్టింది.
ఇప్పటివరకు సినిమాలు చేశాను, సీరియల్స్ చేశాను.ఓటీటీలో కూడా చేయాలనుంది అని చెప్పుకొచ్చాడు.
మరి ఓటీటీ లో ఈయనకు అవకాశం ఇస్తారో లేదో చూడాలి మరి.