ఏపీ ఎన్నికల్లో ఓటమి చెందిన దగ్గర నుంచి వరుస కష్టాలను ఎదుర్కొంటున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ముందు ముందు మరి ఇబ్బందికర పరిస్థితులు తప్పవు అన్నట్టుగానే పరిస్థితి ఉంది .ఇప్పటికే పార్టీకి చెందిన కీలక నేతలు ఎంతోమంది ఇతర పార్టీలోకి వెళ్లిపోయారు .
ఇక రాజ్యసభలో వైసిపి బలం ఎక్కువగా ఉండడంతో , ఆ బలాన్ని తగ్గించే వ్యూహం తో ముందుకు వెళ్తోంది టిడిపి , జనసేన, బిజెపీ( TDP, Janasena, BJP ) కూటమి.ముఖ్యంగా బీజేపీ ఈ విషయంలో దూకుడు ప్రదర్శిస్తుంది .వైసిపి రాజ్యసభ సభ్యులను రాజీనామా చేయించి తమ పార్టీలు చేర్చుకునేందుకు ప్లాన్ చేస్తోంది.ఇప్పటికే మోపిదేవి వెంకటరమణ , పిల్లి సుభాష్ చంద్రబోస్ పార్టీకి పదవులకు రాజీనామా చేశారు.
![Telugu Ap, Bjp Telangana, Krishnaiah, Telangana Bjp, Ysrcp-Politics Telugu Ap, Bjp Telangana, Krishnaiah, Telangana Bjp, Ysrcp-Politics](https://telugustop.com/wp-content/uploads/2024/09/Bjp-Telangana-bjp-ysrcp-ap-elections-government-R-Krishnaiah-ap-politics.jpg)
మరో ఎంపీ రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం.వైసిపి రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ నేత ఆర్ కృష్ణయ్య పార్టీ మారే ఆలోచనతో ఉన్నట్లు సమాచారం.తెలంగాణ ప్రాంతానికి చెందిన ఆర్.కృషయ్యకు జగన్ వైసిపి కండువా కప్పి మరీ రాజ్యసభ సభ్యుడుగా అవకాశం ఇచ్చారు.ప్రస్తుతం తెలంగాణలో బీసీ ఓటు బ్యాంక్ పై దృష్టి సారించిన బిజెపి ఆర్.కృష్ణయ్య ద్వారా తమ ప్రయత్నం నెరవేర్చుకోవాలనే ఆలోచనతో ఉందట.గత ఎన్నికల్లో బీసీ నినాదం వర్కౌట్ కావడంతో బిజెపి అంశంపైనే పూర్తిగా దృష్టి సారించింది.ఎనిమిది అసెంబ్లీ., ఎనిమిది పార్లమెంటు స్థానాలను బిజెపి తెలంగాణ( BJP Telangana )లో గెలుచుకుంది.
![Telugu Ap, Bjp Telangana, Krishnaiah, Telangana Bjp, Ysrcp-Politics Telugu Ap, Bjp Telangana, Krishnaiah, Telangana Bjp, Ysrcp-Politics](https://telugustop.com/wp-content/uploads/2024/09/Bjp-Telangana-bjp-ysrcp-ap-elections-ap-government-R-Krishnaiah-ap-politics.jpg)
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండడంతో, ఆర్.కృష్ణయ్య( R Krishnaiah ) ను వైసిపి ప్రాథమిక సభ్యత్వానికి , రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తే మళ్లీ రాజ్యసభ కు అవకాశం ఇస్తామని ఆఫర్ కూడా ఇచ్చినట్లు సమాచారం.ఆర్ కృష్ణయ్య గతంలో ఆర్ఎస్ఎస్ లో కీలకంగా పనిచేశారు .ఏపీలో బిజెపి నేతలతోనూ సన్నిహిత సంబంధాలు ఆయనకు ఉన్నాయి.వాస్తవంగా ఆర్ కృష్ణయ్య ఎప్పటి నుంచో పార్టీ మారుతారని ప్రచారం జరుగుతూ అయితే దీనిని స్వయంగా ఆర్ కృష్ణయ్య ప్రకటించార.
అయితే ప్రస్తుతం బిజెపి ఒత్తిడి చేస్తుండడం, ఏపీలో వైసిపి పుంజుకునే అవకాశాలు కనిపించకపోవడం , తదితర కారణాలతో ఆయన పార్టీ మారే ఆలోచన చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తుంది.