వైసీపీ అధినేత , మాజీ సీఎం జగన్ పై( Jagan ) హత్యాయత్నం కేసు నమోదు అయింది.వైసిపి మాజీ ఎంపీ , ప్రస్తుత టిడిపి ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు( Raghurama Krishnaraju ) ఇచ్చిన ఫిర్యాదు మేరకు జగన్ తో పాటు , అప్పటి సిఐడి డీజి సునీల్ కుమార్ పై( Suneel Kumar ) గుంటూరు నగరపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు.
అప్పటి సీఎం జగన్ ఒత్తిడితోనే 2021 మే 14న తనను సునీల్ కుమార్ చిత్రహింసలు పెట్టారని రఘురాం కృష్ణంరాజు ఫిర్యాదులు పేర్కొన్నారు.ఈ కేసులో జగన్ A 1 గా ఉండగా, సిఐడి మాజీ డీజీ సునీల్ కుమార్ ఏ 2, ఐపీఎస్ సీతారామాంజనేయులు ను ఏ4గా విజయపాల్ , ఏ 5 గా డాక్టర్ ప్రభావతి లను పోలీసులు చేర్చారు.
![Telugu Ggh Prabhavati, Ips Sunil Kumar, Jagan, Undi Tdp Mla, Ysjagan, Ysrcp Mp-P Telugu Ggh Prabhavati, Ips Sunil Kumar, Jagan, Undi Tdp Mla, Ysjagan, Ysrcp Mp-P](https://telugustop.com/wp-content/uploads/2024/07/raghurama-complaint-case-filed-on-ys-jagan-detailsd.jpg)
అప్పట్లో తనను కస్టడీకి తీసుకున్న పోలీసులు , ఆ సమయంలో హత్యాయత్నం చేశారని , సెక్షన్ 120B, 166,167, 197, 307, 326, 465, 508 (34)! ప్రకారం కేసు నమోదు చేశారు.2021 మే 14న తనపై హత్యాయత్నం చేశారని, రబ్బర్ బెల్ట్, లాఠీలతో కొట్టారని రఘురామ ఫిర్యాదులో పేర్కొన్నారు.జగన్ ఒత్తిడితోనే తనను అక్రమంగా అరెస్టు చేశారని రఘురామ ఫిర్యాదులో పేర్కొన్నారు. కస్టడీలో తనను తీవ్రంగా హింసించారని, తనకు బైపాస్ సర్జరీ జరిగిందని చెప్పినప్పటికీ తన ఛాతిపై కూర్చుని తనను చంపడానికి ప్రయత్నం చేశారని , ఫోన్ పాస్వర్డ్ చెప్పాలని కొట్టారని రఘురామ ఆరోపించారు.
తనకు చికిత్స చేసిన జిజిహెచ్ డాక్టర్ ప్రభావతి( GGH Dr.Prabhavati ) పైన కూడా ఆయన ఫిర్యాదు చేశారు.
![Telugu Ggh Prabhavati, Ips Sunil Kumar, Jagan, Undi Tdp Mla, Ysjagan, Ysrcp Mp-P Telugu Ggh Prabhavati, Ips Sunil Kumar, Jagan, Undi Tdp Mla, Ysjagan, Ysrcp Mp-P](https://telugustop.com/wp-content/uploads/2024/07/raghurama-complaint-case-filed-on-ys-jagan-detailss.jpg)
పోలీసుల ఒత్తిడితో తప్పుడు మెడికల్ రిపోర్ట్ ఇచ్చారని , జగన్ ను విమర్శిస్తే చంపుతామని సునీల్ కుమార్ బెదిరించారని రఘురామ పేర్కొన్నారు. తనను అక్రమంగా అరెస్టు చేసి వేధించారని, ఐదుగురు అగంతుకులతో దారుణంగా హింసించి వీడియో తీసి , అప్పటి సీఎం జగన్ కు చూపించారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు .తప్పుడు రిపోర్ట్ కోసం డాక్టర్లను కూడా మార్చివేసిన పరిస్థితి నెలకొందని, అన్ని డాక్యుమెంట్లు తను వద్ద ఉన్నాయని, జగన్, సునీల్ ఇద్దరూ కలిసి తనపై కుట్ర పన్నారని అందుకే వారిపై ఫిర్యాదు చేశానని రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు.