టాలీవుడ్ హీరో ప్రభాస్( Prabhas ) తాజాగా నటించిన చిత్రం కల్కి.( Kalki ) నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.ఈ సినిమాతో ప్రభాస్ క్రేజ్ మరింత పెరిగింది.మరో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకున్నారు ప్రభాస్.అంతేకాకుండా మరోసారి 1000 కోట్ల గ్రాస్ క్లబ్ లో తన పేరు సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు.మరి ప్రభాస్ హీరోగా నటించిన దీనికి ముందు చిత్రం ఆదిపురుష్( Adipurush ) అన్న విషయం అందరికీ తెలిసిందే.
ఇది కూడా మైథలాజి బ్యాక్ డ్రాప్ లోనే తెరకెక్కించగా ప్రభాస్ రామునిగా కనిపించాడు.అయితే ఈ సినిమాలో ప్రభాస్ వెన్నంటే కనిపించే లక్ష్మణుడి పాత్ర చేసిన బాలీవుడ్ యంగ్ నటుడు సన్నీ సింగ్( Sunny Singh ) లేటెస్ట్ గా ప్రభాస్ పై చేసిన కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్ గా మారాయి.ఈ సందర్భంగా సన్నీ సింగ్ మాట్లాడుతూ.ప్రభాస్ నాకు సినిమాలోను బయట కూడా ఒక పెద్దన్నయ్య లాంటి వాడు.మా నాన్న గారికి కూడా ప్రభాస్ నన్ను తన తమ్ముడు లాంటి వాడు అని చెప్పేవాడని మాతో చాలా సరదాగా ఉంటాడని నా పుట్టినరోజుకి ఏడెనిమిది సార్లు తాను కాల్ చేసాడు అని చెప్పు కొచ్చారు.
ఈ సందర్భంగా సన్నీ సింగ్ చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఇకపోతే డార్లింగ్ ప్రభాస్ విషయానికొస్తే బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ అదే ఊపుతో వరుసగా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీబిజీగా గడుపుతున్నాడు.ప్రస్తుతం ప్రభాస్ చేతిలో మరో నాలుగు ఐదు పాన్ ఇండియా ప్రాజెక్టులు ఉన్నాయి.