టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) గురించి మన అందరికి తెలిసిందే.నందమూరి తారక రామారావు మనవడిగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ తాతకు తగ్గ మనవడు అనిపించుకున్నాడు.
కాగా ఎన్టీఆర్ చివరిగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాతో( RRR ) ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మంచి సక్సెస్ ను సాధించడంతో పాటు తో ఈ సినిమాతో గ్లోబల్ స్టార్ గా( Global Star ) కూడా గుర్తింపు తెచ్చుకున్నారు తారక్.
![Telugu Devara, Jr Ntr, Kota Srinivas, Nandamuritaraka, War-Movie Telugu Devara, Jr Ntr, Kota Srinivas, Nandamuritaraka, War-Movie](https://telugustop.com/wp-content/uploads/2024/07/kota-srinivasa-rao-interesting-words-on-hero-ntr-detailsd.jpg)
ప్రస్తుతం ఒకవైపు కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర మూవీలో( Devara ) నటిస్తూనే మరోవైపు వార్ 2( War 2 ) సినిమాలో కూడా నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు.ఇది ఇలా ఉంటే తాజాగా టాలీవుడ్ సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు( Kota Srinivasarao ) ఎన్టీఆర్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అయినా ఈ సందర్భంగా మాట్లాడుతూ.నేను ఎప్పుడూ చెప్పే మాట ఒకటే.ఇప్పుడు ఉన్న యంగ్ హీరోలలో కొద్దో గొప్పో విషయం ఉండి, సత్తా ఉన్న నటుడు ఎవడైనా ఉన్నాడంటే వాడే జూనియర్ ఎన్టీఆర్. నా ప్రకారం వాడి తర్వాతే ఎవడైనా, పొట్టిగా ఉంటాడని కామెంట్లు చేశారు.
![Telugu Devara, Jr Ntr, Kota Srinivas, Nandamuritaraka, War-Movie Telugu Devara, Jr Ntr, Kota Srinivas, Nandamuritaraka, War-Movie](https://telugustop.com/wp-content/uploads/2024/07/kota-srinivasa-rao-interesting-words-on-hero-ntr-detailsa.jpg)
ఆ పొట్టితనమే తనని కాపాడుతుంది చంద్రమోహన్ లాగా ఎందుకంటే చంద్రమోహన్ కు( Chandra Mohan ) ఎవరూ కాంపిటేషన్ కాదు, వాడు ఎవడికీ కాంపిటేషన్ కాదు అని నవ్వుతూ చెప్పుకొచ్చారు కోట శ్రీనివాసరావు.డైలాగ్స్, డ్యాన్సులు, యాక్షన్ ఇలా ప్రతీ ఒక్క దాంట్లో విషయం ఉన్నవాడు ఎన్టీఆర్.రామారావు గారు పిచ్చోడు ఏమీ కాదు.విషయం ఉన్నోడు కాబట్టే ఆయన్ను ఒళ్లో కూర్చోబెట్టుకుని బొట్టు పెట్టి మరీ తన పేరు పెట్టుకున్నారు అని చెప్పుకొచ్చారు.కాగా ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.