ప్రతి ఏడాది లాగే గత ఏడాది 2023 సంవత్సరానికి గాను సౌత్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ ను( South Film Fare Awards ) ప్రకటించడం జరిగింది.అయితే ఈసారి ఈ సౌత్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ ను ఆర్ఆర్ఆర్( RRR ) అలాగే సీతారామం( Sitaramam ) సినిమాలు ఎక్కువ అవార్డులను సొంతం చేసుకున్నాయి.
అంతర్జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన ఆర్ఆర్ఆర్ మూవీకి ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ లో సీతారామం నుంచి గట్టి పోటీనే ఎదురైంది.మరి ఎవరెవరికి ఏ అవార్డు లభించింది అన్న వివరాల్లోకి వెళితే.
బెస్ట్ యాక్టర్ గా జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) రామ్ చరణ్ లకు( Ram Charan ) అవార్డు దక్కింది.
ఉత్తమ సంగీత దర్శకుడిగా ఎంఎం కీరవాణి ఎంపిక అయ్యారు.బెస్ట్ కొరియోగ్రఫీ గా ప్రేమ్ రక్షిత్ ఎంపిక అయ్యారు.ఇక బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ సాబు సిరిల్ ఎంపిక అవ్వడం జరిగింది.
ఆర్ఆర్ఆర్ సినిమాకు గాని బెస్ట్ సినిమాటోగ్రఫీ గా సెంథిల్ కుమార్ ఎంపిక అయ్యారు.పొన్నియన్ సెల్వన్ 2( Ponniyin Selvan 2 ) సినిమాకు గాను రవి వర్మన్ ఎంపిక అయ్యారు.
ఇక కొమరం భీముడు అనే సాంగ్ కు బెస్ట్ మేల్ సింగర్ గా కాలభైరవ( Kalabhairava ) ఎంపిక అయ్యారు.ఉత్తమ చిత్రంగా సీతారామం మూవీ ఎంపిక అయింది.
ఉత్తమ నటుడు క్రిటిక్స్ హీరో దుల్కర్ సల్మాన్( Dulquer Salmaan ) ఎంపిక అయ్యారు.అదేవిదంగా ఉత్తమ నటిగా మృణాల్ ఠాకూర్( Mrunal Thakur ) ఎంపిక అయింది.అలాగే బెస్ట్ లిరిక్స్ అవార్డుకు సిరివెన్నెల ఎంపిక అయ్యారు.బెస్ట్ ఫిమేల్ సింగర్ గా చిన్మయి ఎంపిక అయింది.ఇక విరాటపర్వం సినిమాకు గాను సాయి పల్లవి ఎంపిక అయింది.సహాయనటిగా నందితాదాస్ ఎంపిక అయింది.
ఉత్తమ సహాయ నటుడిగా రానా దగ్గుబాటి భీమ్లా నాయక్ సినిమాకు గాను ఎంపిక అయ్యారు.