ప్రస్తుతం వేసవి కాలంలో ఎండలు ఏ స్థాయిలో దంచుకుంటున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.ఎండలు, అధిక వేడి కారణంగా ప్రజలు ఆపసోపాలు పడుతున్నారు.
అయితే వేసవిలో ప్రతి ఒక్కరూ ఒంటికి చలువ చేసే ఆహారాలను తెలుసుకోవడానికే ఎక్కువగా మొగ్గు చూపుతుంటారు.ఈ క్రమంలోనే పెసర పప్పు( Green Moong Dal )ను ఆహారంలో భాగం చేసుకుంటారు.
వారానికి రెండు సార్లు అయినా పెసర పప్పును తీసుకుంటారు.ఒంటికి పెసరపప్పు ఎంతో చలువ చేస్తుంది.
పెసరపప్పు లో విటాక్సిన్, ఐసోవిటాక్సిన్ అనే యాంటీ ఆక్సిడెంట్స్( Antioxidants ) నిండి ఉంటాయి.ఇవి శరీరంలోని అధిక వేడిని సమర్థవంతంగా తగ్గిస్తాయి.బాడీకి కూలింగ్ ఎఫెక్ట్ ను ఇస్తాయి.అందుకే చాలామంది వేసవి కాలంలో కందిపప్పును పక్కన పెట్టి పెసర పప్పును వండుకొని తింటూ ఉంటారు.అయితే శరీరానికి చలువ చేయడం మాత్రమే కాదు పెసర పప్పును ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.
పెసర పప్పులో మెగ్నీషియం, మాంగనీస్, పొటాషియం, జింక్, ఐరన్, ఫాస్పరస్, విటమిన్ బి, ఫైబర్, ప్రోటీన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.వెయిట్ లాస్ అవ్వాలని భావిస్తున్న వారికి పెసర పప్పు సూపర్ ఫుడ్ గా చెప్పుకోవచ్చు.పెసర పప్పులో మెండుగా ఉండే ప్రోటీన్ మరియు ఫైబర్ కడుపుని ఎక్కువ సమయం పాటు నిండుగా ఉంచుతాయి.
బరువు తగ్గడంలో తోడ్పడతాయి.అలాగే ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలు వారానికి ఒకసారైనా పెసర పప్పును తీసుకోవాలి.
పెసర పప్పులో ఫోలేట్ రిచ్ ఉంటుంది.కడుపులోని పిండం పెరుగుదలకు ఇది అత్యంత ముఖ్యమైన పోషకం.
పెసర పప్పు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ని ( Bad cholesterol )నియంత్రిస్తుంది.స్ట్రోక్ మరియు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
పెసరపప్పులో ఉండే పొటాషియం, మెగ్నీషియం మరియు ఫైబర్ రక్తపోటును అదుపులో ఉంచటానికి ఉపయోగపడతాయి.మధుమేహం ఉన్నవారు కూడా పెసర పప్పును తీసుకోవచ్చు.
రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించగల సత్తా పెసరపప్పుకు ఉంది.ఇక పెసర పప్పులో ఉండే పలు పోషకాలు కాలేయంలో కొవ్వు పేరుకుపోవడాన్ని నిరోధిస్తాయి.
కాలేయం దెబ్బ తినకుండా కాపాడతాయి.