తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ( Kishan Reddy ) సవాల్ విసిరారు.కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలుపై ఛార్జ్ షీట్ పెడతామని తెలిపారు.
గ్యారెంటీల గారడీలపై మీరు ఛార్జ్ షీట్ వేయాలని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Govt ) అమలు చేయలేదన్న కిషన్ రెడ్డి అందుకే ఒట్లు పెడుతున్నారని విమర్శించారు.
తాము ప్రకటించినట్లు బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లను బరాబర్ ఎత్తేస్తామని స్పష్టం చేశారు.మతపర రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు.మరోవైపు తెలంగాణ అభివృద్ధిపై మాట్లాడే హక్కు కేసీఆర్ కు( KCR ) లేదని చెప్పారు.కేసీఆర్ వలనే తెలంగాణకు( Telangana ) అన్యాయం జరిగిందని ఆరోపించారు.