ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరంగా ఉండాలంటే మనం తీసుకునే ఆహారంలో పోషకాలు, విటమిన్లు, ప్రోటీన్లు చాలా అవసరం.అయితే మారుతున్న జీవనశైలి కారణంగా పెద్దలే కాకుండా చిన్న పిల్లలకు కూడా విటమిన్లు లోపించి వ్యాధుల బారిన పడుతున్నారు.
ఇక ప్రధానంగా విటమిన్( Vitamin ) లోపిస్తే పిల్లల్లో చాలా ఎఫెక్ట్ కూడా ఉంటుంది.విటమిన్ ఈ సహజసిద్ధంగా సూర్య రష్మి నుండి లభిస్తుంది.అలాగే ఈ విటమిన్ డి లో డి1, డి2, డి3 అనే రకాలు కూడా ఉంటాయి.డి2 మరియు డి3 మనుషులకు అత్యంత అవసరమైన సమ్మేళనం అని చెప్పవచ్చు.
కాబట్టి ఇది శరీరానికి క్యాల్షియం, మెగ్నీషియం లాంటి పోషకాలను అందించడానికి ముఖ్య పాత్ర పోషిస్తుంది.అలాగే పిల్లలలో డి విటమిన్ లోపించడం( Vitamin D Deficiency ) వలన ఎముకల బలహీనతకు కూడా కారణమవుతుంది.అంతేకాకుండా చర్మ సమస్యల్లో బారిన కూడా పడవచ్చు.ఇక చేపలను వారానికి రెండు సార్లు పిల్లలకు తినిపించడం వలన విటమిన్ డి లోపం నుండి బయటపడవచ్చు.అంతేకాకుండా ప్రతిరోజు రెండు గుడ్లను తినిపించడం వలన కూడా మంచి ఫలితం ఉంటుంది.
ఇక పాలలో( Milk ) కాల్షియం ఎక్కువగా ఉంటుంది.అందుకే పిల్లలకు రోజు ఒకటి నుండి రెండు గ్లాసుల పాలు ఇవ్వడం వలన వారి పోషకాహారం అందుతుంది.విటమిన్ డి లోపం కారణంగా జుట్టు రాలే సమస్యలు తలెత్తుతాయి.
అలాగే ఆందోళన, ఒత్తిడి లాంటి మానసిక రుగ్మతలు కూడా దారి చేరే ప్రమాదం ఉంది.కాబట్టి ప్రతిరోజు ఉదయం 8 నుండి 10 గంటల సమయంలో, సాయంత్రం 4 నుండి 6 సమయంలో తప్పనిసరిగా సూర్య రష్మి శరీరం పై పడేలా చూసుకోవాలి.