సూర్యాపేట జిల్లా: నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమీషన్ మెంబర్ గా నియమించబడిన సూర్యాపేటకు చెందిన సీనియర్ నాయకురాలు పాల్వాయి రజనీకుమారి, టిపిఎస్సి మెంబర్ హోదాలో మొదటిసారిగా సూర్యాపేట పట్టణానికి విచ్చేసిన సందర్భంగా పలువురు నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలియజేసి శాలువాతో సన్మానించారు.మూడు దశాబ్దాల నుండి ప్రజలకు సేవజేస్తున్న
రజనీ కుమారి సేవలను గుర్తించి టిపిఎస్సి మెంబర్ గా నియమించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదములు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బండారు రాజా,బైరు వెంకన్న,కాకి కృపాకర్ రెడ్డి,ప్రభుత్వ న్యాయవాది గుడిపూడి వెంకటేశ్వరరావు, పోలబోయిన నర్సయ్య యాదవ్,తప్సి గాంధీ, ఆయుభ్ ఖాన్, దాసోజు జానకిరాములు,బోళ్ల శ్రీనివాస రెడ్డి,ఆది సత్యం మునిర్ ఖాన్,శ్రీకాంత్ రెడ్డి, మోదుగు వెంకటరెడ్డి, రాము,రంగారావు పాల్గొన్నారు.