గంజాయి గుట్టు రట్టు చేసిన కొండమల్లేపల్లి పోలీసులు: డిఎస్పీ గిరిబాబు

నల్లగొండ జిల్లా: కొండమల్లేపల్లి పట్టణ కేంద్రంలో వివిధ పాన్ షాపులకు గంజాయి సరఫరా చేసే ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు.శనివారం కొండమల్లేపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దేవరకొండ డిఎస్పి గిరిబాబు వివరాలను వెల్లడించారు.

 Kondamallepalli Police Seized The Ganja Dsp Giribabu, Kondamallepalli Police, Se-TeluguStop.com

కొండమల్లేపల్లి పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా బస్టాండ్ ఆవరణంలో ఒక అనుమానిత వ్యక్తి కనబడడంతో అతని విచారించగా తన వద్ద ఉన్నటువంటి బ్యాగులో ఒక కేజీ గంజాయి దొరకగా అతనిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా చల్ల శివ, నాగరాజుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరులోని మాచర్లలో ఉంటూ అక్రమంగా గంజాయిని వివిధ ప్రాంతాలకు తరలిస్తుంటారని గుర్తించినట్లు తెలిపారు.

అందులో భాగంగానే నిన్న కొండమల్లేపల్లి పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్ దిగి పట్టణంలో వివిధ పాన్ షాపులలో గంజాయిని విక్రయిస్తున్న నిందితుని తీసుకొని విచారించగా కొండమల్లేపల్లి పట్టణం చెందిన అందుగుల రమేష్, వడ్లకొండ సిద్ధార్థ, కలూరి ఆంజనేయులకు తరచుగా గంజాయి విక్రయిస్తానని చెప్పగా వాళ్లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు చెప్పారు.

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గంజాయి నిర్మూలనలో భాగంగా దేవరకొండ పట్టణంలో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో రెక్కి నిర్వహించి, అనుమానిత వ్యక్తులను గుర్తించి విచారిస్తామన్నారు.

అదేవిధంగా తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనను, అలువాట్లను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలన్నారు.

ఎవరైనా గంజాయి విక్రయించినా, సేవించినా మా దృష్టి తీసుకువస్తే వాళ్ల పేర్లను గోప్యంగా ఉంచుతామన్నారు.కేసును చేధించిన కొండమల్లేపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ రాఘవేందర్ రెడ్డి, ఎస్సై వీరబాబు, గుడిపల్లి ఎస్సై రంజిత్ రెడ్డి మరియు సహకరించిన సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube