విద్యాశాఖ సమీక్ష సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయాలు..!!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) శనివారం విద్యాశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మెగా డీఎస్సీ( Mega DSC ) టీచర్ల భర్తీకి చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

 Cm Revanth Reddy Sensational Decisions In The Review Meeting Of The Education De-TeluguStop.com

టీచర్ల పదోన్నతులు బదిలీలలో ఇబ్బందులపై దృష్టి సారించాలని వ్యాఖ్యానించారు.ఈ క్రమంలో ఆయా ఉపాధ్యాయ సంఘాలతో చర్చించాలని సూచించారు.

అలాగే రాష్ట్రంలో బడి లేని గ్రామం ఉండకూడదని విద్యార్థులు లేక మూసివేసిన పాఠశాలలను మళ్లీ తెరవాలని సూచించారు.

ప్రతి ఉమ్మడి జిల్లాలలో స్కిల్ యూనివర్సిటీ( Skill University ) ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.ఇదే సమయంలో టాటా టెక్నాలజీ సాయంతో పాలిటెక్నిక్ మరియు ఇంజనీరింగ్ కాలేజీలలో స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇవ్వబోతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.2000 కోట్ల రూపాయల ఖర్చుతో లక్ష మందికి ఉపాధ్యాయ పారిశ్రామిక శిక్షణ ఇవ్వటానికి టాటా టెక్నాలజీస్( Tata Technologies ) సంస్థ ముందుకొచ్చిందన్నారు.

కాలం చెల్లిన కోర్సులు స్థానంలో ఆధునిక కోర్సులు ప్రవేశపెట్టి… అవి పూర్తి కాగానే ఉద్యోగం లభించేలా చూడాలని.ఆ సంస్థ ప్రతినిధులకు తెలియజేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో నిరుద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Govt ) అనేక హామీలు ఇవ్వడం జరిగింది.మెగా డీఎస్సీకి సంబంధించి కూడా హామీలు ఇవ్వడం జరిగింది.

గెలిచిన తర్వాత ఆ దిశగానే సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాలు తీసుకోవటంతో తెలంగాణ నిరుద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube