ప్రజల వద్దకే ప్రభుత్వం వస్తుంది సమస్యలను పరిష్కరిస్తుంది - ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

రాజన్న సిరిసిల్ల జిల్లా: పరిపాలనను ప్రజల వద్దకు చేర్చాలనేది మా ప్రభుత్వ లక్ష్యం అందుకే ప్రజల వద్దకే ప్రభుత్వం వెళుతుందిని, సమస్యలను పరిష్కరిస్తుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.శనివారం వీర్నపల్లి మండలం లాల్ సింగ్ తండా లో,ఎల్లారెడ్డి పేట మండలం సింగారం గ్రామాల్లో ప్రజా పాలన కార్యక్రమాన్ని ప్రారంభించారు.

 Govt Comes To People And Solves Problems Govt Whip Adi Srinivas, Congress Govt ,-TeluguStop.com

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందని, ప్రజామోదంతో ప్రభుత్వం ఏర్పాటు కాగానే రెండు హామీలను అమలు చేశామని చెప్పారు.మిగిలిన గ్యారంటీలను కూడా అమలు చేయడానికే ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలిపారు.

ఈ ప్రజా పాలన కార్యక్రమం గురువారం నుంచి జనవరి 6 వరకు జరుగుతాయని, అన్ని గ్రామాలు, పట్టణాల్లో వార్డుల వారీగా సభలు నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులను అధికారులు స్వీకరిస్తారని చెప్పారు.అర్హులైన లబ్ధిదారులందరికీ న్యాయం చేస్తామని నిస్సహాయులకు చేయూత అందించడమే మా ప్రభుత్వ లక్ష్యం అని ఆయన అన్నారు.

ప్రజలు నమ్మకంతో మాకు అవకాశం ఇచ్చారనీ,ప్రజల కష్ట సుఖాల్లో తోడుంటామని, ప్రభుత్వానికి ప్రజలు సంపూర్ణ సహకారం అందించాలనీ కోరారు.

ఇప్పటికే ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం, ఆరోగ్య శ్రీ పరిమితి రూ.10 లక్షలకు పెంపు హామీని నెరవేర్చామని చెప్పారు.100 రోజుల్లో అర్హులకు 6 గ్యారంటీ లు అమలు చేస్తామన్నారు.చాలా వరకు పొడు భూముల సమస్యలు ఉన్నాయని,అర్హులకు పొడు భూమి పట్టాలు మంజూరు చేస్తాం…సిరిసిల్ల జిల్లా అభివృద్ధిపై ప్రజలు ప్రభుత్వం మరింది అభివృద్ధి లో వెనకబడుతుందని అపోహలు పెట్టుకోకూడదని, జిల్లా పరిధిలో అభివృద్ధికి రాష్ట్రప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube