వరంగల్ లో విజయసంకల్ప సభలో బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రసంగించారు.ఈ క్రమంలో ఆయన బీఆర్ఎస్, కాంగ్రెస్ పై తీవ్రంగా విమర్శలు చేశారు.
తెలంగాణలో మద్యం ఏరులై పారుతోందని అమిత్ షా అన్నారు.కేసీఆర్ రాష్ట్రాన్ని అవినీతికి అడ్డాగా మార్చారని ఆరోపించారు.
కాళేశ్వరంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్న అమిత్ షా కేసీఆర్ చేసిన కుంభకోణాలను లెక్కించడానికి వారం రోజులకు కూడా సరిపోవని తెలిపారు.మియపూర్ భూముల ద్వారా రూ.4 వేల కోట్లు దోచుకున్నారన్న ఆయన మిషన్ కాకతీయలో రూ.22 వేల కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపణలు చేశారు.బీఆర్ఎస్ అంటే అవినీతి, అక్రమాలు అని ఎద్దేవా చేశారు.