దేశంలోని చాలా కుటుంబాలు పేదరికం వల్ల ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి.ఖర్చులు పెరుగుతున్న స్థాయిలో ఆదాయం పెరగకపోవడం ఎన్నో కుటుంబాలకు శాపంగా మారుతోంది.
పేదింటి విద్యాకుసుమం అమరేందర్ పేదరికం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదురైనా చదువులో టాపర్ గా నిలవడంతో పాటు కెరీర్ పరంగా సక్సెస్ సాధించడం గమనార్హం.
విద్యుత్ ఏఈగా( AE ) ఉద్యోగం సాధించిన అమరేందర్( Amarender ) ఉద్యోగం సాధించడంతో కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
అమరేందర్ సక్సెస్ స్టోరీ ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తుందని చెప్పవచ్చు.అమరేందర్ తల్లీదండ్రులకు అర ఎకరం భూమి మినహా ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు.కూలిపనిపై ఆధారపడి అమరేందర్ తల్లీదండ్రులు జీవనం సాగించారు.

అమరేందర్ చదువుకు మేనమామ తన వంతు సహాయం చేశారు.అమరేందర్ తొమ్మిదో తరగతి చదువుతున్న సమయంలోనే తండ్రి మరణించాడు. పదో తరగతిలో 514 మార్కులు సాధించిన అమరేందర్ మండల్ లెవెల్ లో సెకండ్ టాపర్ గా నిలిచారు.ఇంటర్ లో ఫ్రీ సీట్ దక్కించుకున్న అమరేందర్ ఇంటర్ లో 96.3 శాతం మార్కులు సాధించడం గమనార్హం.ఎంసెట్ లో ( Eamcet ) కూడా అమరేందర్ మంచి ర్యాంక్ సాధించారు.

బీటెక్( B.Tech ) పూర్తైన తర్వాత అమరేందర్ కు చెన్నైలో ప్రైవేట్ జాబ్ రాగా కొన్ని కారణాల వల్ల ఆ ఉద్యోగానికి రాజీనామా చేశారు.ఆ తర్వాత రోజుల్లో అమరేందర్ ఎంతో కష్టపడి ఏఈగా ఉద్యోగం సాధించారు.
అమరేందర్ రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలను సొంతం చేసుకుంటారేమో చూడాల్సి ఉంది.పేదరికం ఉన్నా టాలెంట్ ఉంటే ప్రతిభకు తగ్గ గుర్తింపు దక్కుతుందని అమరేందర్ ప్రూవ్ చేస్తున్నారు.
అమరేందర్ కు రాబోయే రోజుల్లో కెరీర్ పరంగా మరిన్ని విజయాలు దక్కుతాయేమో చూడాలి.ప్రతిభ ఉన్నవాళ్లకు దేవుడి నుంచి కూడా మనుషుల రూపంలో ఏదో ఒక విధంగా సహాయం దక్కుతుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.







