ఎన్నికల ప్రవర్తన నియమావళికి తెలంగాణ సాంస్కృతిక సారథులు కట్టుబడి ఉండాలి

ఓటు ప్రాధాన్యత, ఓటు హక్కు సద్వినియోగంపై మాత్రమే ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలి జిల్లా పౌర సంబంధాల అధికారి మామిండ్ల దశరథం రాజన్న సిరిసిల్ల జిల్లా: ఎన్నికల ప్రవర్తన నియమావళి కట్టుబడి ఉంటూ క్షేత్ర స్థాయిలో తెలంగాణ సాంస్కృతిక సారథులు ఓటు యొక్క ప్రాధాన్యత ను తెలిపేలా మాత్రమే కార్యక్రమాలు నిర్వహించాలనీ జిల్లా పౌర సంబంధాల అధికారి మామిండ్ల దశరథం అన్నారు.అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల నేపథ్యంలో బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని డీపీఆర్ఓ కార్యాలయంలో తెలంగాణ సాంస్కృతిక సారథులతో డీపీఆర్ఓ సమావేశం అయ్యారు.

 Telangana Cultural Leaders Should Adhere To The Election Code Of Conduct , Telan-TeluguStop.com

అక్టోబర్ 1, 2023 నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఈ నెల 31 వ తేదీలోగా ఓటరుగా నమోదు చేసుకునేలా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.పోలింగ్ కేంద్రాలలో ఓటర్ల సౌకర్యార్థం కేంద్ర ఎన్నికల సంఘం కల్పిస్తున్న కనీస మౌలిక సదుపాయాలు,ఈవీఎం లను ఉపయోగిస్తూ ఓటు హక్కు వినియోగించుకునే విధానం, ఓటు హక్కు సద్వినియోగం పై ప్రచారం కార్యక్రమాలు చేపట్టాలనీ జిల్లా పౌర సంబంధాల అధికారి మామిండ్ల దశరథం సూచించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube