ప్రస్తుత వేసవికాలంలో( Summer ) ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంత కష్టమో చర్మాన్ని కాపాడుకోవడం కూడా అంతే కష్టం.ఎండలు, అధిక వేడి కారణంగా స్కిన్( Skin ) చాలా డ్యామేజ్ అవుతూ ఉంటుంది.
టాన్ అయిపోవడం, స్కిన్ డ్రై అవ్వడం లేదా ఆయిల్ గా మారడం, స్కిన్ టోన్ తగ్గిపోవడం ఇలా రకరకాల చర్మ సమస్యలు ఇబ్బంది పడుతూ ఉంటాయి.అయితే వీటన్నిటికీ చెక్ పెట్టి వేసవిలో చర్మాన్ని ఆరోగ్యంగా మరియు కాంతివంతంగా ఉంచడానికి సహాయపడే టాప్ 3 ఫేస్ ప్యాకుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ప్యాక్ 1:

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు చందనం పొడి,( Sandalwood Powder ) రెండు టేబుల్ స్పూన్లు బొప్పాయి పండు ప్యూరీ, వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్, వన్ టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకు అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై వాటర్ తో కడిగేయాలి.బొప్పాయిలో( Papaya ) ఉండే సహజ ఎంజైమ్ లు చర్మానికి చక్కని పోషణ అందించడమే కాకుండా స్కిన్ ను టైట్ గా మరియు బ్రైట్ గా మారుస్తాయి.
అలాగే చందనం పొడి, అలోవెరా జెల్ మరియు రోజ్ వాటర్ చర్మాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతాయి.అదే సమయంలో స్కిన్ టోన్ ను ఇంప్రూవ్ చేస్తాయి.
ప్యాక్ 2:

ఒక బౌల్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు గడ్డ పెరుగు( Curd ) వేసుకోవాలి.అలాగే మూడు టేబుల్ స్పూన్లు ఫ్రెష్ కీర దోసకాయ జ్యూస్( Cucumber Juice ) వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకు చేతులకు అప్లై చేసుకుని పది నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై చర్మాన్ని సున్నితంగా మసాజ్ చేసుకుని వాటర్ తో క్లీన్ చేసుకోవాలి.
ఈ విధంగా చేయడం వల్ల చర్మం డ్రై అవ్వకుండా తేమగా ఉంటుంది.కీర దోసకాయ పెరుగు చర్మానికి కూలింగ్ ఎఫెక్ట్ ను ఇస్తాయి.
అలాగే చర్మం పై ఏమైనా మచ్చలు ఉంటే వాటిని తొలగిస్తాయి.వేసవిలో చర్మ ఆరోగ్యాన్ని కాపాడటానికి ఈ సింపుల్ ప్యాక్ చాలా బాగా సహాయపడుతుంది.
ప్యాక్ 3:

ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ముల్తానీ మట్టి,( Multani Mitti ) వన్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి,( Rice Flour ) రెండు టేబుల్ స్పూన్లు లెమన్ జ్యూస్, వన్ టేబుల్ స్పూన్ హనీ మరియు రెండు టేబుల్ స్పూన్లు రైస్ వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు అప్లై చేసుకుని 15 నిమిషాల తర్వాత కడిగేయాలి.ఆయిలీ స్కిన్ వారికి వేసవిలో ఈ ప్యాక్ ది బెస్ట్ వన్ గా చెప్పుకోవచ్చు.ఈ ప్యాక్ ను తరచూ వేసుకోవడం వల్ల చర్మంపై అధిక ఆయిల్ ఉత్పత్తి తగ్గుతుంది.
స్కిన్ తరచూ జట్టుగా మారకుండా ఉంటుంది.అలాగే ఈ ప్యాక్ వల్ల స్కిన్ గ్లోయింగ్ గా మెరుస్తుంది.
టాన్ రిమూవ్ అవుతుంది.స్కిన్ టోన్ సైతం ఇంప్రూవ్ అవుతుంది.