రాజన్న సిరిసిల్ల జిల్లా: అక్టోబర్ 11 అంతర్జాతీయ బాలికల దినోత్సవం పురస్కరించుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అన్ని మండలాలలో ఘనంగా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా మహిళల పట్ల ముఖ్యంగా బాలికల పట్ల జరుగుతున్న వివక్ష, ఆసమానతలు, అడ్డంకులు, అపోహలు మూఢనమ్మకాలపై విద్యార్థిని విద్యార్థులకు ఉపాధ్యాయులకు అవగాహన ఇవ్వడం జరిగింది.
అన్ని మండలాలలో ఈరోజు కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థులకు ఉపాధ్యాయులకు ప్రజలకు అవగాహన కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది.అలాగే సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది.
అలాగే ఈరోజు కోనరావుపేట మండల కేంద్రంలోని జూనియర్ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి పీ లక్ష్మీరాజం ముఖ్యఅతిథిగా హాజరై పిల్లలకి బాలిక విద్యా ప్రాముఖ్యత, ఆస్తిలో హక్కు, లైంగిక వేధింపుల నుంచి రక్షణ, వరకట్నం దురాచారం, ఇతర సాంఘిక దురాచారాల గురించి అవగాహన కల్పించడం జరిగింది.అలాగే సమానత్వము, జీవించే హక్కు, భాగస్వామ్యపు హక్కు అభివృద్ధి చెందే హక్కుల గురించి వివరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ గారు సిబ్బంది పాల్గొన్నారు.అలాగే రుద్రంగి మండల కేంద్రంలోని పరిధిలోని మానాల ఉన్నత పాఠశాలలో బాలిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది.
మారుమూల ప్రాంతాలలో వెనుకబడిన గిరిజన తండాలలో మహిళల పట్ల జరుగుతున్న వివక్ష, వెనుకబాటుతనానికి గల కారణాలను ప్రజలకు విద్యార్థులకు వివరించారు.ఇక్కడ విద్యార్థిని విద్యార్థులు బాగా చదువుకోవాలని విద్య కోసం ప్రభుత్వం కస్తూరిబా గాంధీ విద్యాలయాలు, మోడల్ విద్యాలయాలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, ఇతర సౌకర్యాలు, షీ టీం, భరోసా టీంలు, మధ్యాహ్న భోజన పథకం , బ్రేక్ ఫాస్ట్, ఉచిత పుస్తకాలు మొదలైనవన్నీ ప్రభుత్వం నుంచి అందుతున్నాయి, కావున ప్రతి ఒక్కరు వీటిని సద్వినియోగం చేసుకొని విద్యలో మంచి ఉన్నత స్థానాన్ని పొందాలని, జ్ఞానం సమపార్జించి ఉన్నత స్థానాలు చేరుకోవాలని ఆకాంక్షించారు.
సిడిపిఓ సుచరిత, సూపర్వైజర్స్ గంగ లక్ష్మి, మమత, డి హాబ్ కోఆర్డినేటర్ రోజా, కౌన్సిలర్ దేవిక,డిసిపిఓ స్వర్ణలత ,ప్రొటెక్షన్ ఆఫీసర్ శ్రీనివాస్, సోషల్ వర్కర్ విజయ్, మానాల జడ్.పి.హెచ్.ఎస్ హెచ్.
ఎం రామకృష్ణ, కొనరావుపేట జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీలక్ష్మి, సిబ్బంది పాల్గొన్నారు…