రాజన్న సిరిసిల్ల జిల్లా మధ్యాహ్న కొనరావుపేట మండలంలో భోజన కార్మికులకు పెంచిన వేతనాలు చెల్లింపులకు బడ్జెట్ విడుదల చేయాలని, కొత్త మెనుకు బడ్జెట్ కేటాయించాలని, పెండింగ్ బిల్లులు తక్షణం విడుదల, జీవో నెంబర్ 8 ప్రకారం వేతనాలను ఏరియర్స్ తో సహా చెల్లించాలి.గుర్తింపు కార్డులు ప్రభుత్వం ఇవ్వాలి.
వంట షెడ్లు, వంట పాత్రలు తదితర మౌలిక వసతులు కల్పించాలి.కాటన్ బట్టల యూనిఫామ్ ఇవ్వాలి, సామాజిక భద్రత కల్పించాలి.
ప్రమాద బీమా, పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి.ఎలాంటి షరతులు లేకుండా బ్యాంకు ద్వారా రుణాలు ఇవ్వాలి.తదితరు డిమాండ్లతో ఈరోజు మండల రెవెన్యూ అధికారికి సమ్మె నోటీసులు అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో సిఐటియు మధ్యాహ్న భోజన రంగం జిల్లా కార్యదర్శి గురజాల శ్రీధర్, ఎల్లారెడ్డి, కార్మికులు గొట్టే బాలామణి, కవిత, వెంకటలక్ష్మి, లక్ష్మి మిగతా మొత్తం మంది కార్మికులు పాల్గొన్నారు.