రోడ్డు ప్రమాదాల నివారణకే డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు - ఎస్పీ అఖిల్ మహాజన్

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన 05 వ్యక్తులకు ఒక్కొక్కరికి ఒక రోజు జైలు శిక్ష 1000-/ రూపాయల చొప్పున జరిమానా విధించిన కోర్టు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగి చాలా మంది చనిపోయి వారివారి కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయని, మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రాణాలకు ముప్పని, రోడ్డు ప్రమాదాలలో ఎక్కువ శాతం మద్యం సేవించి వాహనాలు నడపడం వల్లనే జరుగుతున్నాయని అన్నారు.

 Drunk And Drive Tests To Eradicate Road Accidents Sp Akhil Mahajan, Drunk And Dr-TeluguStop.com

జిల్లా పరిధిలో ప్రతి రోజు వాహనాల తనిఖీల్లో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది అని ఈ తనిఖీల్లో మద్యం తాగి వాహనాలు నడుపుతు పట్టిపడితే జైలు శిక్ష జరిమానా తప్పదని ఈ సందర్భంగా హెచ్చరించారు.

తరచు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుబడిన వ్యక్తుల యొక్క డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని ఆ యొక్క లైసెన్స్ రద్దుకు సంబంధిత రవాణా శాఖ అధికారులకు సిఫారసు చేయడం జరుగుతుంన్నారు.డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన వ్యక్తులకు తాగి వాహనాలు నడపడం వల్ల జరిగే అనర్దాల గురించి కౌన్సెల్లింగ్ ఇవ్వడం జరిగిందని,అలాగే వారికి ట్రాఫిక్ నియమ నిబంధనల గురించి ప్రతి పోలీస్ స్టేషన్ లో అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు.1 కుంభం చిన్న గంగయ్య, మరుపాక,2.డొక్కా పోచయ్య తిప్పాపుర్, 3.జాప మల్లేశం, కరీంనగర్,4.భూక్యా రమేష్ గర్జనపల్లి,5.లింగంపల్లి ఎల్లయ్య చింతల్ టాన అనే వ్యక్తులకు డ్రంక్ అండ్ డ్రైవ్ లో జైలు శిక్ష విధించబడినట్లు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube