అకాల వర్షంతో రైతు అపార నష్టం

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు లేక పడిగాపులు పడుతున్న రైతులపై వరుణుడు కూడా కరుణ చూపలేదు.గురువారం రాత్రి ఒక్కసారిగా దంచి కొట్టిన వానతో ధాన్యం కుప్పలన్నీ కొట్టుకుపో యాయి.

 Due To Untimely Rain, The Farmer Suffered Huge Losses , Grain , Farmers , Me-TeluguStop.com

కల్లాల్లో కండ్ల ముందే కొట్టు కుపోతున్న వడ్లను చూసి రైతుల కన్నీళ్లు వరదలై పారాయి.మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలోని గొల్లపల్లి గ్రామంలో బుధవా రం అర్ధరాత్రి నుంచి కురిసిన వర్షానికి ధాన్యం కుప్పలు తడిశాయి.

రైతులు( Farmers ) రాత్రంతా నిద్రాహా రాలు మాని, కాలువలు తీసి నీటిని తొలగించారు.గురువారం అధికారుల తీరును నిరసిస్తూ కల్లాల వద్దే రైతులు ఆందోళన చేశారు.

కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలంలో, సిద్దిపేట జిల్లా వర్గల్‌లో వర్షానికి ధాన్యం తడిసిపో యింది.

మెదక్‌ జిల్లా ( Medak )కొల్చారం, చిలిపిచెడ్‌, నిజాంపేట్‌, రామాయంపేట్‌ మండ లాల్లో, సంగారెడ్డి జిల్లా జిన్నారంలో వడ్లు తడిశాయి.

మహబూ బ్‌నగర్‌ జిల్లా బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌లో ఆరుబయట ఉన్న ధాన్యం, మొక్కజొన్న కుప్పలు తడిసిపోయాయి.సిద్దిపేట జిల్లా( Siddipet District ) మిరుదొడ్డి, దుబ్బాక మార్కెట్‌ యార్డు ల్లో ధాన్యం తడిసి రైతులు ఇబ్బందులు పడ్డారు.

గజ్వేల్‌ రింగ్‌రోడ్డు వెంబడి అరబె ట్టిన ధాన్యం కొట్టుకుపో యింది.రోడ్డు వెంబడి కొట్టుకపో తున్న వడ్లను రైతులు ఒకదగ్గరకు చేర్చుతున్నారు.

సింగాటం, శ్రీగిరిపల్లి, అహ్మదీపూర్‌, బూరుగు పల్లి, దిలాల్‌పూర్‌, శేర్‌పల్లి గ్రామాలకు వెళ్లే మార్గాల్లో రోడ్ల వెంబడి ఆరబెట్టిన వడ్లుదీ దాదాపు ఇదే పరిస్థితి.యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ కొనుగోలు కేంద్రాల్లో వడ్ల రాశుల చుట్టూ నీరు నిలిచి రైతులు ఇబ్బందులు పడ్డారు.

కరీంనగర్‌ మార్కెట్‌ యార్డులోనూ ఆరబోసిన ధాన్యం తడిసిపోవడంతో రైతులు ఆగమాగమ య్యారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube