హైదరాబాద్ లో అక్షరయాన్ తెలుగు ఉమెన్స్ రైటర్స్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ సంబురాలు జరిగాయి.మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు( Former Governor Vidyasagar Rao ) ముఖ్య అతిథిగా హాజరు అయిన ఈ కార్యక్రమంలో కవి అందెశ్రీని( Poet Andeshri ) పంపకవి పురస్కారంతో సత్కరించారు.ఈ సందర్భంగా కవి అందెశ్రీ సంచలన వ్యాఖ్యలు చేశారు.జై తెలంగాణ తన అమ్మకు చిరునామా అని పేర్కొన్నారు.తనకు తన మాతృభాష తప్ప మరో భాష రాదని చెప్పారు.ఒక్కడు లెక్కలు వేసుకుంటే వచ్చేది కాదు నా తెలంగాణ అని తెలిపారు.
తనకు జన్మనిచ్చింది తెలంగాణ అన్న అందెశ్రీ తన తల్లి తెలంగాణను చెడగొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.