ధరణి పోర్టల్ పై తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.కాంగ్రెస్ ప్రభుత్వం భూ రికార్డులను పారదర్శకంగా రికార్డు చేసిందని తెలిపారు.
పేదలకు కాంగ్రెస్ భూములు పంచిందన్న రేవంత్ రెడ్డి సమస్యలు ఉన్నంత వరకు పోరాటాలు ఉంటాయని పేర్కొన్నారు.భూ రికార్డులను డిజిటలైజ్ చేసే ప్రక్రియను కాంగ్రెస్ మొదలు పెట్టిందన్నారు.
రంగారెడ్డి, నల్గొండ జిల్లాలో వేలాది ఎకరాలు భూదాన్ భూములు ఉన్నాయని చెప్పారు.అయితే ఈ భూదాన్ భూములు అన్నీ అన్యాక్రాంతం అవుతున్నాయని విమర్శించారు.
నిషేధిత జాబితాలో ఉన్న భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేస్తున్నారని ఆరోపించారు.