హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రాన్ని వర్షాలు వదలడం లేదు.గత కొన్ని రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.
ఎండాకాలంలో కురుస్తున్న వర్షాలకు అన్నదాతలు కుదేలవుతున్నారు.వాతావరణ శాఖ మళ్ళీ రెండురోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.
ఆగ్నేయ బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడి,అది ఎల్లుండి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది.దీని ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం సూచించింది.
రాష్ట్రానికి మోచా తుఫాను ముప్పు పొంచి ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం నేడు హెచ్చరించింది.