తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.కాంగ్రెస్ పార్టీ అమ్మలాంటిదన్న ఆయన ఎవరైనా పార్టీలోకి రావొచ్చని తెలిపారు.
క్షణికావేశంలో పార్టీని వీడిన వారు తిరిగి రావాలని సూచించారు.
వివేక్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఈటల లాంటి వారు కాంగ్రెస్ లోకి రావాలని రేవంత్ రెడ్డి అన్నారు.
ఈ నేపథ్యంలో అన్నీ హైకమాండ్ చూసుకుంటుందని పేర్కొన్నారు.పార్టీ కోసం పది మెట్లు అయినా కిందకు దిగుతానని స్పష్టం చేశారు.







