సమాజంలో ఇటీవల జరుగుతున్న దారుణాలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి.పశువుల కంటే హీనంగా మనుషులను చిత్రహింసలు పెట్టి ముక్కలు ముక్కలుగా నరకడం, మనిషి యొక్క ప్రైవేట్ పార్ట్స్ పై దాడి చేయడం లాంటి ఘోరాల గురించి వింటే రాత్రులు నిద్ర పట్టడం కూడా కష్టమే.
ఇలాంటి కోవకు చెందిన ఓ సంఘటన సూరత్ లో( Surat ) చోటుచేసుకుంది.ఓ వ్యక్తి తనతో వివాహేతర సంబంధం( Illegal Relationship ) పెట్టుకున్న మహిళ దూరం పెట్టడంతో విచక్షణ రహితంగా ఆ మహిళపై అత్యాచారం చేసి, ఆమె ప్రైవేట్ పార్ట్స్ పై లలో కారం పోసి చిత్రహింసలకు గురిచేశాడు.
దీనికి సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.

వివరాల్లోకెళితే.సూరత్ లో నివాసం ఉండే అమృత్ భాయ్ పటేల్( Amrut Bhai Patel ) అనే వ్యక్తి తన వివాహ విషయం దాచి పెట్టి మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.కొంతకాలం వీరి వివాహేతర సంబంధం సాఫీగానే సాగింది.
తర్వాత అమృత్ భాయ్ పటేల్ కు వివాహం అయ్యిందని, తన భార్య ఇతనితో కాకుండా విడిగా గ్రామంలో నివసిస్తుంది అనే విషయం తెలియడంతో తన వివాహేతర సంబంధానికి స్వస్తి పలికి అమృత్ భాయ్ పటేల్ ను దూరం పెట్టేసింది.

అయితే పటేల్ ఆ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగించాలని గొడవపడేవాడు.ఆ మహిళ అందుకు అంగీకరించకపోవడంతో కేబుల్ వైర్ తో విచక్షణారహితంగా కొట్టి అత్యాచారానికి పాల్పడ్డాడు.ఇంతటి తో ఆగకుండా ఆమె ప్రైవేట్ భాగాలలో కారంపొడి పోశాడు.
ఈ విషయం బయటకు చెబితే తాము సన్నిహితంగా దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తారని బెదిరించాడు.అక్కడి నుంచి ప్రాణాలతో బయటపడిన ఆ మహిళ ఆసుపత్రిలో చేరి, తరువాత ఓల్పాడ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
పోలీసులు అతడిపై ఐపీసీ సెక్షన్ 376 కింద కేసు నమోదు చేసి నిందితుడిని మంగళవారం అదుపులోకి తీసుకున్నారు.