సినీ నిర్మాత కేపీ చౌదరి డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి.టాలీవుడ్ కు చెందిన పలువురు ప్రముఖులకు కేపీ చౌదరి డ్రగ్స్ విక్రయించారని తెలుస్తోంది.
కాగా కేపీని కస్టడీకి తీసుకున్న పోలీసులు రెండు రోజులపాటు విచారించిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో విచారణలో కొద్ది మంది వివరాలను కేపీ చౌదరి వెల్లడించారని సమాచారం.
బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి, ఐటెం సాంగ్స్ చేసిన మరో హీరోయిన్ జ్యోతితో పాటు క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణితో కేపీ చౌదరి కాల్స్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.ఈ ముగ్గురితో వందలాది కాల్స్ మాట్లాడారని నిర్దారించారు.
అదేవిధంగా కేపీ చౌదరి ఖాతాలో సుమారు 11 అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు.ఈ నేపథ్యంలో కేపీ చౌదరిని పోలీసులు మరోసారి కస్టడీకి కోరనున్నారని సమాచారం.