హైదరాబాద్ లో విషాద ఘటన చోటు చేసుకుంది.కుక్కల దాడిలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఐదు నెలల బాలుడు ఇవాళ మృత్యువాతపడ్డాడు.
షేక్ పేటలోని వినోబానగర్ లో ఈనెల 8న గుడిసెలో నిద్రిస్తున్న ఐదు నెలల బాలుడు శరత్ పై కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి.వెంటనే గమనించిన బాలుని తల్లిదండ్రులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించిన సంగతి తెలిసిందే.
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి ఇవాళ మరణించాడు.దీంతో బాలుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.