భూమిపై కొన్ని ప్రదేశాలు చాలా చల్లగా ఉంటాయి, అక్కడ ప్రశాంతంగా అసలు ఉండలేం.చాలా బట్టలు ధరించే చలికి వణికిపోతూ వెచ్చదనం కోసం నిత్యం పాకులాడాల్సి ఉంటుంది.
జీవించడానికి ఏ విధంగానూ అనుకూలంగా లేని ఈ ప్రాంతాలలో కొందరు ప్రజలు మరో మార్గం లేక అలానే చలిని భరిస్తూ రోజులు గడుపుతుంటారు.ఇక ఉష్ణోగ్రత గడ్డకట్టే స్థానం కంటే తక్కువగా పడిపోయే ప్రదేశాలలో ప్రతిదీ సెకన్లలో మంచుగా మారుతుంది.
ఈ ప్రదేశాలలో ఒకటి అంటార్కిటికా( Antarctica ) దక్షిణ ధ్రువానికి సమీపంలో ఉంది, ఇక్కడ ఔట్‌డోర్‌లో ఒక వ్యక్తి ఇటీవల ఓ రూట్ బీర్‌తో ఫ్రీజింగ్ టెస్ట్ కండక్ట్ చేశాడు.ఆ సమయంలో -84 డిగ్రీల F ఉష్ణోగ్రత ఉంది.
సదరు వ్యక్తి ఆ ఉష్ణోగ్రతలో చేసిన ఎక్స్‌పరిమెంట్‌కు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు.ఆ వీడియో వైరల్‌గా మారింది.
వీడియోలో అతను -84 డిగ్రీల F యొక్క విపరీతమైన చలిలో రూట్ బీర్ తాగడానికి ప్రయత్నిస్తున్నట్లు చూపిస్తుంది.

వీడియోకు “ఐస్-కోల్డ్ (-84 డిగ్రీల F)లో గ్లాస్ రూట్ బీర్ పోస్తున్నాం.” అని క్యాప్షన్ జోడించారు.అయితే, అతను సీసా/బీర్ క్యాన్‌లో నుంచి ద్రవాన్ని పోయగానే, అది గాలిలోనే గడ్డకట్టింది.
బీర్ ఘన ముక్కలుగా నేలపై పడిపోతుంది.ఈ వీడియో ఇంటర్నెట్‌లో చాలా మందిని ఆశ్చర్యపరిచింది.
అలానే బీర్ పోస్తుంటేనే గడ్డకడుతుండటం వల్ల నెటిజన్లు ఆ దృశ్యాన్ని చూసి షాక్‌కు గురైయ్యారు, ఆ ప్రదేశంలో ఎంత చలి ఉంటుందో అని ఊహించుకున్నారు.

వీడియోలో గ్లాస్‌లో బీర్ పోస్తుండగా ఆ లిక్విడ్ గడ్డ కట్టి గ్లాస్ బీర్ క్యాన్ ఒకదానికొకటి అటాచ్ కావడం చూడవచ్చు.వైరల్ వీడియో పదార్థాలపై తక్కువ ఉష్ణోగ్రత ఎలాంటి ప్రభావాలను చూపిస్తుందో కూడా కళ్లకు కట్టినట్లు చూపించింది.ఇది చాలా కఠినమైన వాతావరణంలో జీవించడం వల్ల కలిగే సవాళ్లు, ప్రమాదాలను కూడా వెల్లడిస్తుంది, ఇక్కడ ఆల్కహల్ తాగడం కూడా అసాధ్యం అని వీడియో తెలుపుతోంది.







