ఈటలకు సెక్యూరిటీ.. డీజీపీకి కేటీఆర్ కీలక ఆదేశాలు

హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్( Huzurabad MLA Etela Rajendar ) భద్రతపై మంత్రి కేటీఆర్ ఆరా తీశారు.ఇదే అంశమై డీజీపీ అంజనీకుమార్( DGP Anjani Kumar ) తో ఫోన్ లో కేటీఆర్ మాట్లాడారు.

 Minister Ktr Call To Dgp Anjani Kumar Over Etela Rajender Security,etela Rajende-TeluguStop.com

ఈటల భద్రతపై సీనియర్ ఐపీఎస్ అధికారితో వెరిఫై చేయించాలని డీజీపీకి కేటీఆర్ సూచించారు.రాష్ట్ర ప్రభుత్వం తరపునే ఈటలకు సెక్యూరిటీ ఇవ్వాలని సూచించారు.

ఈటలకు భద్రత పెంపుపై డీజీపీ సమీక్ష చేయనున్నారు.

కాసేపట్లో ఈటల ఇంటికి సీనియర్ ఐపీఎస్ అధికారి వెళ్లనున్నారు.

అయితే నిన్న ప్రెస్ మీట్ లో ఈటల భార్య జమున ఈటలకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి( BRS MLC Padi Kaushik Reddy )తో ప్రాణ హాని ఉందని సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.దీంతో గంటల వ్యవధిలోనే ఈటలకు ‘‘వై కేటగిరి’’( Y Category Security )/em> భద్రత కల్పిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించిన విషయం తెలిసిందే.

తాజాగా రాష్ట్ర ప్రభుత్వమే ఈటలకు సెక్యూరిటీ ఇవ్వాలని మంత్రి కేటీఆర్( Minister KTR ) డీజీపీని ఆదేశించడంతో హుజురాబాద్ ఎమ్మెల్యే భద్రతపై ఉత్కంఠ నెలకొంది….

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube