తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు( Assembly Elections ) జరగనున్న సంగతి తెలిసిందే.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మూడోసారి జరగబోతున్న ఈ ఎన్నికలను ప్రధాన పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.
ఇప్పటివరకు రెండు సార్లు జరిగిన ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ( BRS Party ) విజయం సాధించటం జరిగింది.అయితే మూడోసారి కూడా గెలిచి హ్యాట్రిక్ సాధించాలని.
ఈ ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకున్నారు.ఇదిలా ఉంటే కర్ణాటకలో ఊహించని విధంగా భారీ మెజార్టీతో అధికారం కైవసం చేసుకున్న కాంగ్రెస్ తెలంగాణలో కూడా విజయం సాధించే దిశగా వ్యూహాలు వేస్తూ ఉంది.
ఇక ఇదే సమయంలో బీజేపీ( BJP ) కూడా తెలంగాణలో విజయం సాధించే దిశగా ప్రయత్నాలు చేస్తూ ఉంది.పరిస్థితి ఇలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల సంఘం మరో ప్రధాన ఎన్నికల అధికారిని నియమించడం జరిగింది.
మేటర్ లోకి వెళ్తే తాజాగా లోకేష్ కుమార్( Lokesh Kumar ) ను రాష్ట్ర ఎన్నికల అదనపు ప్రధాన అధికారిగా నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది.అలాగే రాష్ట్ర ఎన్నికల సంయుక్త ప్రధాన అధికారిగా సర్ఫరాజ్ కు బాధ్యతలు అప్పగించడం జరిగింది.
ఈ ఇద్దరి అధికారుల నియామకానికి సంబంధించి నేడు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.