తెలంగాణ మహిళలకు రేపటి నుండి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం

హైదరాబాద్: డిసెంబర్ 08 తెలంగాణ కాంగ్రెస్ మంత్రివర్గం కొలువుదీరిన కొద్ది గంటల వ్యవధిలోనే డా.బిఆర్.

 Telangana Women Free Travel In Rtc Buses From Tomorrow, Telangana Women, Free Tr-TeluguStop.com

అంబేద్కర్ సచివాలయంలో జరిగిన తొలి కేబినెట్ సమావేశంలో మంత్రులు, పలు కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు.ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని సుదీర్ఘంగా సమీక్షించిన మంత్రివర్గం మరో కీలకమైన అంశంగా విద్యుత్ రంగం పరిస్థి తులపైన హాట్‌హాట్‌గా చర్చలు జరిపారని తెలిసింది.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన గురువారం సచివాలయంలో తొలి కేబినెట్ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, మంత్రులు, సిఎస్ శాంతి కుమారి ఇతర శాఖల అధికారులు హాజ రైయ్యారు.

ఆరు గ్యారెంటీల అమలు, ప్రజా సమస్యలపై చర్చించారు.ముందుగా సిఎంగా సచివాలయంలో బాధ్యతలు రేవంత్‌రెడ్డి స్వీకరించారు.సిఎంగా సచివాలయంలోకి అడుగుపెట్టిన ఆయన పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.లోపల రేవంత్‌రెడ్డికి వేద పండితులు స్వాగతం పలికారు.

తరువాత కేబినెట్ సమావేశం నిర్వహించి ఉచిత విద్యుత్, ఆరు గ్యారెంటీలపై మంత్రివర్గం చర్చించింది.అనంతరం మీడియాతో మంత్రి డి.శ్రీధర్‌బాబు మాట్లాడుతూ ఈనెల 9న సోనియా గాంధీ జన్మ దినోత్సవం సందర్భంగా ముందుగా రెండు గ్యారెంటీలు అమలు చేస్తామని, రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితి రూ.10 లక్షలకు పెంచి పేదలకు వైద్య సేవలు అందించనున్నట్లు స్పష్టం చేశారు.

రాబోయే ఐదేళ్లలో ప్రజలు కోరుకునే మార్పు చూపిస్తామని, శుక్రవారం రెండు గ్యారెంటీలకు సంబంధించి ఆయా శాఖలతో సీఎం చర్చించనట్లు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రజలకు తెలియజేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులుకు ఆదే శించినట్లు చెప్పారు.2014 నుంచి 2023 డిసెంబర్ 7వ తేదీ వరకు ప్రభుత్వ వ్యయాలపై శ్వేతపత్రం విడుదల చేస్తామని పేర్కొన్నారు.అదే విధంగా వ్యవసాయం రంగానికి 24 గంటల పాటు ఉచిత విద్యుత్ కొనసాగిస్తామని, గృహాలకు 200 యూనిట్ల ఉచితంగా సరఫరా చేస్తామన్నారు.రైతులకు పెట్టుబడి సాయంపై కూడా చర్చిం చినట్లు,

ఆరు గ్యారెంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని, ఐదేళ్లలో రాష్ట్రాన్ని అభివృద్ది దిశగా తీసుకెళ్లతామని వెల్ల డించారు.

మంత్రులకు శాఖల కేటాయింపులపై సిఎం, హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని, గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షల విషయంపై కూడా చర్చించాని, అధికారుల నుంచి పూర్తి వివరాలు అందాక నిర్ణయం తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పంటలను ఆయా జిల్లాలకు సంబంధించిన మంత్రులు పరిశీలిస్తారన్నారు.

రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టినందుకు శుభాకాంక్షలు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube